ముఖ్యమంత్రి కావాలని తాంత్రిక పూజలు !..

By SumaBala Bukka  |  First Published Oct 21, 2023, 7:50 AM IST

ముఖ్యమంత్రి కావాలని తాంత్రిక పూజలు చేయించడం ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తన గెలుపు కోసం తాంత్రికపూజలు చేయిస్తున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.


మధ్యప్రదేశ్ : ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు రాజకీయ నాయకులు. అయితే, భోపాల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు భయాందోళనలకు గురి చేసేలా ఉంది. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తన గెలుపు కోసం తాంత్రికపూజలు చేయిస్తున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ నేత కమల్నాథ్ ఫోటో పెట్టి.. దాని ఎదురుగా పూలు, నిమ్మకాయలు.. కుంకుమ లాంటి సామాగ్రితో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి.

ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో భోపాల్ లో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కమల్నాథ్ ముఖ్యమంత్రి కావాలనే తను ఈ పూజలు చేస్తున్నట్లుగా తాంత్రిక పూజారి భయ్యూ మహారాజ్  ఓ టీవీ ప్రతినిధికి చెప్పారు కూడా. దీంతో ఇది మరింత గందరగోళానికి దారి తీసింి. దీనిమీద స్వయంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. 

Latest Videos

వార్నీ.. భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది, ఒప్పందపత్రం కూడా రాసుకుంది.. ఎక్కడంటే...

‘ఎవరైనా ఆధ్యాత్మిక సాధనలో భక్తి మార్గంలో నిమగ్నం కావాలంటే దానికి ధర్మబద్ధంగా స్వచ్ఛంగా నిర్వహించుకోవాలి. అలాకాకుండా ఇలా క్షుద్ర పూజలు చేయడమేంటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సేవ చేయాలి. దీనికోసం మేము చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే ప్రజలకు దగ్గరవుతాం. కొందరు మాత్రం స్మశాన వాటికలో తాంత్రిక పూజలు చేస్తున్నారు.  వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’ అంటూ ప్రశ్నించారు. 

click me!