
స్కూల్ యూనిఫాంలో మలవిసర్జన చేసినందుకు ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. ఆగ్రహంతో ఏడేళ్ల బాలుడిపై వేడినీళ్లు పోశాడు. దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 40 శాతం శరీరం వేడి నీరు వల్ల కమిలిపోయింది. ఉపాధ్యాయలోకమే తలదించుకునే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Bengaluru floods: భారీ వరదల మధ్య దోసల ప్రమోట్.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ట్రోల్స్ !
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచూర్ జిల్లా సంతేకల్లూర్ గ్రామంలో ఘనమథేశ్వర గ్రామీణ సంస్థ అనే సంస్థ ఓ ప్రాథమిక పాఠశాలను నిర్వహిస్తోంది. ఇందులో హులిగెప్ప అనే వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో అఖిల్ అనే ఏడళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగే ఆ విద్యార్థి స్కూల్ కు వెళ్లాడు. స్కూల్ లో ఉన్న సమయంలో యూనిఫామ్ లో మల విసర్జన చేశాడు.
దీంతో ఆ టీచర్ కు కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా, విచక్ష లేకుండా వేడి నీళ్లు తీసుకొచ్చి అఖిల్ పై పోశాడు. దీంతో ఆ స్టూడెంట్ ఒక్క సారిగా కేకలు వేశాడు. వేడి నీరు పడటంతో శరీరం మొత్తం కమిలిపోయింది. దీంతో వెంటనే మిగితా సిబ్బంది బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దాదాపు 40 శాతం కాలిన గాయాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి గాయాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్రమ రుణ యాప్స్ కు కేంద్రం చెక్.. కట్టడి చర్యలు ప్రారంభించిన ఆర్బీఐ
అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. “ బాలుడిపై వేడి నీళ్లు పోసిన ఘటనపై మాకు సమాచారం ఉంది. కానీ ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. మా సిబ్బంది పాఠశాలకు వెళ్లారు. కానీ అది విద్యా శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ” అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
కర్ణాటకలోని తుమకూరులోని అంగన్ వాడీ సెంటర్‌లో ఒక ఉపాధ్యాయురాలు 3 ఏళ్ల బాలుడి జననాంగాలను కాల్చిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. దళిత వర్గానికి చెందిన ఆ పిల్లాడు తన అండర్ వేర్ లోమూత్ర విసర్జన చేసినందుకు ఉపాధ్యాయురాలు మరో సహాయకురాలితో కలిసి చిన్నారి జననాంగాలను కాల్చేసింది. నిందితురాలిని 28 ఏళ్ల అసిస్టెంట్ టీచర్ రష్మీగా గుర్తించారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..త్వరలో అందుబాటులోకి వందే భారత్-2 హై స్పీడ్ రైళ్లు
ఈ సంఘటన తరువాత నిందితుడైన ఉపాధ్యాయురాలు క్షమాపణలు చెప్పింది. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. కానీ బాధితురాలి కుటుంబం దీనికి ఒప్పుకోలేదు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు నిందితురాలిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా ఇదే కేసులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ ఉపాధ్యాయురాలికి నోటీసులు కూడా జారీ చేసింది.