Intelligence Bureau: IB చీఫ్‌గా తపన్ కుమార్ దేకా నియ‌మ‌కం.. RAW చీఫ్ ప‌దవీ కాలం పొడిగింపు

Published : Jun 25, 2022, 04:09 AM IST
Intelligence Bureau: IB చీఫ్‌గా తపన్ కుమార్ దేకా నియ‌మ‌కం.. RAW చీఫ్ ప‌దవీ కాలం పొడిగింపు

సారాంశం

Intelligence Bureau: ఇంటెలిజెన్స్‌ బ్యూరో(IB ) చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ దేకా శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(RAW ) చీఫ్‌ సమంత్‌ గోయల్‌ పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పొడిగిస్తున్నట్టు మరో ఆర్డర్‌లో పేర్కొన్నది.  

Intelligence Bureau: ఇంటెలిజెన్స్‌ బ్యూరో(IB ) చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ దేకా శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేర‌కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న ప్రస్తుత IB చీఫ్ అరవింద్ కుమార్ స్థానంలో నియమిస్తాడు. ప్రస్తుత IB చీఫ్ పొడిగించిన పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం.. డెకా ప్రస్తుతం IB  ఆపరేషన్స్ వింగ్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. రెండేళ్లపాటు ఐబీ చీఫ్‌గా నియమితులయ్యారు. అతను హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ IPS అధికారి. 

ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అరవింద్‌ కుమార్‌ పదవీకాలం జూన్‌ 30తో ముగియనున్న‌ది. అర‌వింద్ కుమార్ 1984 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ఇంతకు ముందు ఆయనకు రెండుసార్లు పొడిగింపు లభించింది. ఈసారి తన సర్వీసు పొడిగింపు ఇవ్వకూడదని అరవింద్ కుమార్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే.. అత్యున్నత పోస్టుల్లో నిరంతరం సర్వీసు పొడిగించడంతో కిందిస్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ.. ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌గా 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ సీనియర్ IPS అధికారి తపన్ కుమార్ దేకాను నియమించింది. అత‌డు ఈ పోస్టులో 2 సంవత్సరాల పాటు కొన‌సాగ‌నున్నారు.  అంటే తపన్ కుమార్ దేకా జూలై 1, 2022 నుండి జూలై 1, 2024 వరకు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 

ఇదే స‌మ‌యంలో 1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్ IPS అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్ స్వాగత్ దాస్‌ను IB నుండి తొలగించి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో అంతర్గత భద్రత ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. 

మ‌రో ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(ఆర్‌ఏడబ్ల్యూ) చీఫ్‌ సమంత్‌ గోయల్‌ పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పొడిగిస్తున్నట్టు మరో ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఇంతకు ముందు కూడా ఆయ‌న స‌ర్వీసులో ఈ పదవీ కాలాన్ని పొడిగించారు. తాజా ఉత్త‌ర్వుల‌తో సమంత్ కుమార్ గోయల్ ఈ పోస్ట్‌లో ఏడాది పాటు కొనసాగగలరు. ఆయనను డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పదవికి పంపే అవకాశం ఉందని ముందుగా చర్చించారు.

చాలా కాలంగా ఖాళీగా ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెడ్ పోస్టును కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసింది. పంజాబ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దినకర్‌ గుప్తాను ఈ పోస్టులో నియమించారు. అంత‌కు ముందు..CRPF డైరెక్టర్ జనరల్ ఈ పోస్టు అదనపు బాధ్యతను చూసేవారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం