Maharashtra Political Crisis: "స్వంత వాళ్లే వెన్నుపోటు పొడిచారు": ఉద్ధవ్‌ ఠాక్రే

By Rajesh KFirst Published Jun 25, 2022, 1:21 AM IST
Highlights

Maharashtra Political Crisis: తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే తెరతీశారు. స్వంత వాళ్లే.. వెన్నుపోటు పోడిచారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేడు.. కాంగ్రెస్, ఎన్‌సిపిలు శివసేనకు మద్దతుగా నిలిచార‌నీ, కానీ, స్వంత వారే త‌నకు న‌మ్మ‌క‌ద్రోహం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 

Maharashtra Political Crisis: మ‌హారాష్ట్ర‌లో రాజకీయ సంక్షోభం కొన‌సాగుతోంది. అధికార శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌, షిండే వర్గాలు పోటాపోటిగా చర్యలు, ప్రతి చర్యలతోపాటు మాటల దాడికి దిగుతున్నాయి. శుక్రవారం శివసేన భవన్‌కు తరలివచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి ఉద్ధవ్‌ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి తెరతీశారు. స్వంత వాళ్లే.. వెన్నుపోటు పోడిచారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేడు.. కాంగ్రెస్, ఎన్‌సిపిలు శివసేనకు మద్దతుగా నిలిచార‌నీ, కానీ, స్వంత వారే త‌నకు వెన్నుపోటు పొడిచారని బాధ‌ను వ్య‌క్తం చేశారు. 

గెలవలేని వారికి టికెట్లు ఇచ్చి గెలిపించామ‌ని, నేడు వాళ్లే త‌న‌కు వెన్నుపోటు పొడిచారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. శివసేన కార్పొరేటర్లతో సంభాషించిన ఉద్ధవ్ ఠాక్రే తన బాధను వ్యక్తం చేశారు.బిజెపితో కక్షకట్టే వ్యక్తులను తప్పనిసరిగా ప్రశ్నించాలని, తాను అసమర్థుడిని అని చెబితే, మ‌రుక్షణమే పార్టీని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారాయన. అంతకుముందు.. శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ సాయంత్రం ముంబైలోని థాక‌రే నివాసం 'మాతోశ్రీలో  కలిశారు.

శుక్ర‌వారం సాయంత్రం సీఎం ఉద్ధవ్ థాకరే త‌న పార్టీ కార్యకర్తలతో ఉద్వేగ‌పూరితంగా మాట్లాడారు. తిరుగు బాటుదారులు పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వెళ్లిపోయిన వారి గురించి నేనెందుకు బాధపడతానని,  శివసేన, థాకరే పేర్లను ఉపయోగించకుండా.. ఎలా ముందుకు వెళతారని ప్ర‌శ్నించారు.

మరో శివసేన ఎమ్మెల్యే గౌహతిలోని తిరుగుబాటు శిబిరంలో చేరారు, ఇప్పటికే నియంత్రణను చేజిక్కించుకోవడానికి తగినంత మంది సభ్యులు ఉన్నారని నమ్ముతారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటవచ్చని అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. రాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించాలన్న శివసేన ప్రతిపాదనకు డిప్యూటీ స్పీకర్ ఆమోదం తెలిపారు. అనర్హత పిటిషన్లు దాఖలైన రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఈరోజు నోటీసులు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు  తెలిపాయి.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమకు నోటీసులు జారీ చేయగానే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంత‌కు మందు.. తన వర్గమే నిజమైన శివసేన అని వాదించిన షిండే.. 37 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, శాసనసభ కార్యదర్శికి లేఖ‌లు పంపారు.

click me!