
చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్‌జెండర్లపై కొందరు తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. వారిని వ్యభిచార రొంపిలోకి దింపడానికి బలవంతపెట్టారు. ఇద్దరు యువకులైతే.. వారు తమకు లైంగికంగా సహకరించడం లేదని జుట్టు కత్తిరించారు. జుట్టు కత్తిరిస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
తమిళనాడు తూత్తుకుడి ఏరియాలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల జుట్టును బలవంతంగా కట్ చేశారు. ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్ జుట్టును చేతపట్టుకుని కట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతున్నది.ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టు గ్రేస్ భాను ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో కనిపిస్తున్న ఇద్దరు యువకులపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులకు విషయం చేరింది. కలుగుమలై పోలీసులు ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
వీడియోలని నిందితులు సహా బాధితులనూ తాము గుర్తించామి, ఇందుకు సంబంధించి లీగల్ యాక్షన్ తీసుకుంటున్నామని ట్యూటికకోరిన్ ఎస్పీ ఎల్ బాలాజీ శరవణ తెలిపారు.
Also Read: బోనాలకు వచ్చిన ట్రాన్స్ జెండర్ పై స్నేహితుడి దాడి, చికిత్స పొందుతూ మృతి..
ఈ ఘటన అక్టోబర్ 7వ తేదీన జరిగినట్టు స్థానిక వర్గాలు కొన్ని వివరించాయి. వారి ప్రకారం, ఆ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు తూత్తుకుడి నుంచి కోవిల్‌పట్టికి బయల్దేరి వెళ్లుతుండగా వారిని యొవ బుబాన్, విజయ్ అనే యువకులు అపహరించి దాడి చేశారు.
ఆ ఇద్దరు బాధితులు వెంటనే టౌన్ వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. ఎవరికీ చెప్పకుండా ఆ ఇద్దరూ టౌన్ వదిలిపెట్టి వెళ్లిపోయారు.
నిందితులు ఆ బాధితులను వ్యభిచారంలోకి బలవంతంగా దింపారు. వారికి సెక్సువల్ ఫేవర్ ఇవ్వడానికి బలవంతం చేశారు. అయితే, నిందితులకు వారు సెక్సువల్ ఫేవర్స్ ఇవ్వనందుకు ఈ వేధింపులకు దిగారని తెలుస్తున్నది.
ఆ నిందితులు ఇద్దరూ ఈ వీడగియోను షేర్ చేసి ఇతర ట్రాన్స్‌జెండర్లు కూడా తమకు సెక్సువల్ ఫేవర్స్ ఇవ్వకుంటే వారికీ ఇదే గతి పడుతుందని వారు బెదిరించినట్టు సమాచారం.