సొంత మరదలినే దారుణంగా హతమార్చిన బావ...విచారణలో సంచలన విషయాలు వెల్లడి

Published : Apr 09, 2019, 02:33 PM IST
సొంత మరదలినే దారుణంగా హతమార్చిన బావ...విచారణలో సంచలన విషయాలు వెల్లడి

సారాంశం

సొంత మరదలినే మేనబావ అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడంతో పాటు ఆమె చేతి వేళ్లను సైతం కత్తిరించి హింసించి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఉన్మాద చర్యనె తీవ్రంగా పరిగణించిన పోలీసులు పరారీలో వున్న నిందితున్ని పట్టుకుని విచారించిన పోలీసులకు అతడు సంచలన విషయాలను వెల్లడించినట్లు సమాచారం. 

ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో  ప్రగతి(20) అనే యువతి డిగ్రీ చదువుతోంది. ఆమె గత శుక్రవారం సొంత మేనత్త కొడుకు సతీష్  కుమార్ తో కలిసి షాపింగ్ చేయడానికని భయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోమ రంగంలోకి దిగిన పోలీసులు నగర శివారులో యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన మృతురాలి మేనబావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల విచారణలో నిందితుడు తనను డబ్బులు, బంగారం కోసం వేధించడంతోనే మరదలిని హతమార్చినట్లు వెల్లడించాడు. తనకు పెళ్లయినప్పటికి మరదలితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాని... దీన్ని అదునుగా తీసుకుని ఆమె తనను డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టిందని తెలిపాడు. లేదంటే తన భార్యకు తమ సంబంధం గురించి చెబుతానంటూ బెదిరిస్తుండటంతో ఈ హత్యకు పాల్పడినట్లు భయటపెట్టాడు. 

దీంతో ఎప్పటిలాగే ప్రగతిని షాపింగ్ కని భయటకు పిలిచి ఊరి భయట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపాడు.  తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పొడిచి హతమార్చి చనిపోయినట్లు నిర్ధారించుకుని అక్కడినుండి పరారైనట్లు విచారణ సందర్భంగా నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా నేరాన్ని ఒప్పుకున్న నిందితున్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు తమిళనాడు పోలీసులు వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu