ఒడిషాలో ప్రత్యేక హోదా సెగ... బిజూ జనతా‌దళ్ ఫిర్యాదుతో బిజెపిపై కేసు

By Arun Kumar PFirst Published Apr 8, 2019, 8:35 PM IST
Highlights

మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే ఒడిషాలో కూడా ప్రత్యేక హోదా వివాదం చెలరేగుతోంది. గత ఎన్నికల సందర్భంగా ఒడిషా కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన బిజెపి పార్టీ ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టేకోలేదని బిజూ జనతా దళ్ పార్టీ ఆరోపిస్తోంది. మళ్లీ లోక్ సభ ఎన్నికలు వచ్చినా బిజెపి ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావన కూడా తిసుకురాకపోవడంతో ఆగ్రహించిన అధికార బీజేడి ఏకంగా బిజెపిపై పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు పెట్టింది.

ఇటీవల ఒడిషా బిజెపి విడుదల చేసిన మేనిపెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని బీజేడీ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒడిషా ప్రజలను ప్రత్యేక హోదా పేరుతో మోసం చేసినందుకే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కర్వేలా నగర్ బిజెడి నాయకులు తెలిపారు. 

గత 2014 ఎన్నికల్లో బిజెపి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిపెస్టోలో పొందుపర్చిందని...కానీ ఈసారి మాత్రం ఈ హమీ మేనిఫెస్టో నుండి కూడా మాయమవడంలో మతలబేంటని బిజెడి ప్రశ్నించింది. ఐదేళ్లుగా హోదా కోసం ఎదురుచూసిన ప్రజలకు బిజెపి చివరకు ఇలా మోసం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలా మోసం చేసిన పార్టీని ఒడిషా ప్రజలు తమ ఓటుహక్కుతోనే సమాధానం చెబుతారని బిజెడి నాయకులు అన్నారు.  

ఒడిషాలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కలిపి ఒకేసారి జరగనున్నాయి. మొదటి నాలుగు విడతల్లో భాగంగా ఈనెల 11, 18, 23, 29 తేదీల్లో  ఒడిషాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజకీయాలు వేడెక్కి పార్టీల మధ్య మాటలయుద్దం కాస్తా ఇలా పోలీస్ కేసుల వరకు వెళుతున్నాయి.  

click me!