రోడ్డుపై కాన్వాయ్ పరుగులు.. చేతిలో అర్జితో వృద్ధురాలు, కారు ఆపి సమస్య తెలుసుకున్న స్టాలిన్

By Siva KodatiFirst Published Jun 15, 2021, 4:55 PM IST
Highlights

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీఎంకే చీఫ్, ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీఎంకే చీఫ్, ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి సాధకబాధకాలను తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జయలలిత హయాంలో ప్రారంభమైన అమ్మ క్యాంటీన్లు ఆమె పేరిట అలాగే కొనసాగుతాయని ప్రతిపక్షాల్ని సైతం ఆకట్టుకున్నారు. ఇక కోవిడ్ సంక్షోభ సమయంలోనూ పేదలను ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు.

తాజాగా సీఎం స్టాలిన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చి వెళుతుండగా రోడ్డు పక్కన అర్జీ పట్టుకుని నిల్చున్న మహిళను ముఖ్యమంత్రి గమనించారు. వెంటనే ఆయన తన కాన్వాయ్ ఆపి ఆ వృద్ధురాలి నుంచి అర్జీ స్వీకరించారు.

Also Read:కరోనాతో పోరాటంలో.. సీఎం నిధికి `ఉప్పెన` స్టార్‌ విజయ్‌ సేతుపతి సహాయం..

ఆమె సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే ఆ అర్జీపై సంతకం చేసి, దాన్ని అధికారులకు ఇచ్చి  వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదంతా తన కళ్ల ఎదురుగానే జరగడంతో ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది

click me!