కేంద్ర కేబినెట్ విస్తరణఫై ఊహగానాలు: ఎంపీలతో అమిత్ షా కీలక బేటీ

By narsimha lodeFirst Published Jun 15, 2021, 4:22 PM IST
Highlights

కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  ఎంపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  ఎంపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.  కరోనా సమయంో ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనేందుకుగాను  ఎంపీలతో అమిత్ షా సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత ఐదు రోజులుగా ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు మంత్రులతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.అమిత్ షా శని, ఆదివారాల్లో ఉత్తర్‌ప్రదేశ్ , మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీలతో భేటీ అయ్యారు. సుమారు 30 మంది ఎంపీలు ఆయనను కలిశారు.కేబినెట్ విస్తరణ గురించి కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ నిర్వహిస్తున్న మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. 

also read:కేబినెట్ విస్తరణపై ఊహగాహనాలు:మంత్రులతో మోడీ భేటీ

ప్రస్తుతం మోడీతో పాటు 21 మంది కేబినెట్ మంత్రులున్నారు. తొమ్మిది మంది స్వతంత్రహోదా కలిగిన సహాయ మంత్రులు కూడ  మోడీ కేబినెట్ లో కొనసాగుతున్నారు.గత రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రాల్లో మిత్రులతో ఉన్న విబేధాలను పరిష్కరించుకొనేందుకు కేబినెట్ విస్తరణను  బీజేపీ ఉపయోగించుకొనే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.బీహార్ నుండి జేడీ(యూ) మోడీ కేబినెట్ లో బెర్త్ కోరుకొంటున్నారు. లోక్‌జనశక్తి పార్టీకి మరో కేబినెట్ బెర్త్ దక్కాల్సి ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా కూడ బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చింది.ఆయనకు కేబినెట్ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కుంచుకోవడంలో బీజేపీ వైఫల్యం చెందింది. కానీ రాష్ట్ర అసెంబ్లీలో మూడోవంతు స్థానాలను ఆ పార్టీ గెలుచుకొంది. బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కేబినెట్ బెర్త్ పొందే అవకాశం ఉందని ఊహగానాలు కూడ లేకపోలేదు. కేంద్ర కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా బెంగాల్ రాష్ట్రానికి మరిన్ని పదవులు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ ఉంది. బెంగాల్ రాష్ట్రానికి బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందనేందుకు ఇదే నిదర్శనంగా చెబుతున్నారు.

click me!