సొంత కొడుకులపై రిటైర్డ్ పోలీస్ కాల్పులు, ఒకరు మృతి..

Published : Jun 15, 2021, 04:28 PM IST
సొంత కొడుకులపై రిటైర్డ్ పోలీస్ కాల్పులు, ఒకరు మృతి..

సారాంశం

ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులమీద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2 ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. 

అయితే తండ్రితో గొడవల కారణంగా కొడుకులు విజయ్, సుజయ్ వేరుగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సోమవారం సాయంత్రం పాటిల్ తన కుమారులను ఓ విషయం మీద మాట్లాడడానికి తన ఇంటికి పిలిచినట్లు తెలిపారు. 

కాగా తండ్రీ, కొడుకుల మధ్య కారు భీమా మీద పెద్ద గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకుని తన ఇద్దరు కొడుకులమీద నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక చికిత్స కోసం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. 

అయితే విజయ్ కి తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు తెలిపారు. కాగా అతని సోదరుడు జయ్ కు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?