యవ్వనంగా కనిపించడానికి మీ సీక్రెట్ ఏంటీ?.. సిగ్గుపడుతూ సీఎం సమాధానం.. వీడియో వైరల్

Published : Sep 21, 2021, 04:47 PM IST
యవ్వనంగా కనిపించడానికి మీ సీక్రెట్ ఏంటీ?.. సిగ్గుపడుతూ సీఎం సమాధానం.. వీడియో వైరల్

సారాంశం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. మార్నింగ్ వాకింగ్, జిమ్‌లో వ్యాయామాలు, సైక్లింగ్ ఇలా ఏదో ఒకటి చేస్తూ తరుచూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. తాజాగా ఓ వీడియోలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సీఎంను ఇప్పటికీ యవ్వనంగా కనిపించడం వెనుకున్న రహస్యమేంటని ఓ మహిళ అడిగారు. దీనితో నవ్వుకుంటూ తన డైట్ కంట్రోలే దానికి కారణమని సమాధానమిచ్చారు.  

చెన్నై: సార్.. 68 ఏళ్ల వయసులోనూ మీరు యవ్వనంగా కనిపించడానికి రహస్యమేంటని ఓ మహిళ అడిగిన ప్రశ్నకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఒకింత సిగ్గుపడ్డారు. మందహాసంతోనే తన డైట్ కంట్రోల్ అని సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సీఎం స్టాలిన్‌ను అక్కడున్న కొందరు ఈ ప్రశ్నలు వేశారు.

ట్రాక్ సూట్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స్టాలిన్‌పై ఓ పార్క్‌లో కొందరు ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఓ మహిళ ఇంత వయసు వచ్చినా ఇంకా ఎలా యవ్వనంగా కనిపించగలుగుతున్నారని, ఆయన పాటించే రహస్యమేమిటని అడిగారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుల పవ్వులు పూయించారు. సీఎం స్టాలిన్ కూడా నవ్వారు. నవ్వుతూనే తన డైట్ కంట్రోలే అందుకు కారణమని వివరించారు. 

 

తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టాలిన్ జిమ్ వర్కవుట్స్‌ను డీఎంకే పోస్టు చేస్తూ ఉన్నది. ఇటీవలే ఆయన వర్కవుట్ వీడియో ఒకటి వైరల్ అయింది. మరో వీడియోలో ఆయన ఓ సైకిల్‌పై వెళ్తూ ఓ టీ షాప్ దగ్గర నిలబడ్డారు. అక్కడ స్థానికులతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన దినచర్యలో యోగా కూడా చేస్తారని వివరించారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పిటకీ తన మనవళ్లతో కాసేపు ఆడుకుంటారని తెలిపారు. పది రోజులకు ఒకసారి సైక్లింగ్ చేస్తారని చెప్పారు. రోజూ తప్పకుండా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేస్తారని, అందుకే కాబోలు తాను బిజీగా ఉన్నప్పటికీ అలసిపోరని వివరించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్