అశ్లీల ఫొటోలు షేర్ చేస్తానని బెదిరించి.. మైనర్ బాలికపై అత్యాచారం.. !

Published : Sep 21, 2021, 03:57 PM IST
అశ్లీల ఫొటోలు షేర్ చేస్తానని బెదిరించి.. మైనర్ బాలికపై అత్యాచారం.. !

సారాంశం

గ్రామంలోని కమ్యూనిటీ హాల్ కు బాలికను పిలిచి రహస్యంగా తన ఫోటోలు... తీసి మళ్లీ కలవడానికి నిరాకరిస్తే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆ నిందితుడు బెదిరించాడు. ఈ క్రమంలో జులై 20న, నిందితుడు బాలికను అర్థరాత్రి బ్లాక్ మెయిల్ చేసి తన కారులో గ్రామ శివారులోని ఓ గోడౌన్ కు తీసుకెళ్లాడు. 

హర్యానా : తన అభ్యంతరకర ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేస్తానని బెదిరించి ఓ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన విషయం మాట్లాడాలనే నెపంతో నిందితుడు జూన్ లో బాధితురాలిని సంప్రదించి, ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. 

ఇటీవల గ్రామంలోని కమ్యూనిటీ హాల్ కు బాలికను పిలిచి రహస్యంగా తన ఫోటోలు... తీసి మళ్లీ కలవడానికి నిరాకరిస్తే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆ నిందితుడు బెదిరించాడు. ఈ క్రమంలో జులై 20న, నిందితుడు బాలికను అర్థరాత్రి బ్లాక్ మెయిల్ చేసి తన కారులో గ్రామ శివారులోని ఓ గోడౌన్ కు తీసుకెళ్లాడు. 

ఆ తరువాత తుపాకీతో బెదిరించి తనమీద అత్యాచారం చేసి, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తరువాత అర్థరాత్రి ఒంటి గంటకు ఆమెను ఇంటి దగ్గర్లో దింపి అతను పరారయ్యాడు. ఈ దారుణం ఈ నెల జూలై 20న జరిగినప్పటికీ, నిందితుడు తనను చంపేస్తానని బెదిరించడంతో బాలికమీద జరిగిన అఘాయిత్యాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. 

చివరికి కుటుంబసభ్యలుకు ఇటీవల ఈ వ్యవహారం చెప్పడంతో వారు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురుగ్రాంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరినుంచి తుపాకీ, కారుని స్వాధీనం చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్