సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలోని కొలీజియం దేశంలోని ఎనిమిది హైకోర్టుకు నూతన సీజేల పదోన్నతికి సిఫారసులు చేసింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకూ కొత్త సీజేలకు సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గడ్ హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాలు రాబోతున్నారు.
న్యూఢిల్లీ: ఎనిమిది హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల హైకోర్టులకూ నూతన సీజేలు రాబోతున్నారు. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఈ నెల 16న సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫారసులు చేసినట్టు తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం వెబ్‌పేజ్‌లో పేర్కొంది.
మొత్తం 8 హైకోర్టులకు నూతన సీజేల పదోన్నతితోపాటు, ఐదు హైకోర్టుల సీజేలు, 17 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసులు చేసింది.
undefined
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ కర్ణాటక హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు జస్టిస్ రంజిత్ వీ మోరెను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఛత్తీస్‌గడ్‌కు, మధ్యప్రదేశ్ జస్టిస్ మొహమ్మద్ రఫీఖ్ మధ్యప్రదేశ్‌కు, త్రిపుర హైకోర్టు జస్టిస్ అకిల్ ఖురేశీ రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజీత్ మహంతిని త్రిపురకు, మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దర్‌ను సిక్కిం హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని సిఫారసు చేసింది.