చెన్నై దక్షిణ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా తమిళిసై సౌందరరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా తమిళిసై సౌందరరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19న ఆమోదించారు. ఈ నెల 20న తమిళిసై సౌందర రాజన్ బీజేపీలో చేరారు.
బీజేపీ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుండి తమిళిసై సౌందరరాజన్ కు చోటు దక్కింది. దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానానికి తమిళిసై సౌందరరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు గాను తాను గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టుగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.
undefined
నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. దక్షిణ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బాధ్యత గల వారన్నారు. తమ ఎంపీ మంచి పార్లమెంటేరియన్ కావాలని కోరుకుంటున్నారన్నారు.ప్రజలు ఏ సమస్యనైనా నేరుగా చెప్పుకొనే వీలు తన వద్ద ఉంటుందన్నారు. కానీ, ప్రస్తుత ఎంపీ వద్ద ఆ రకమైన పరిస్థితి లేదని ఆమె అభిప్రాయపడ్డారు.దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుండి డీఎంకె అభ్యర్ధిగా తమిళచ్చి తంగపాండియన్, ఎఐఎడిఎంకె పార్టీ అభ్యర్ధిగా జె.జయవర్దన్ లు నామినేషన్లు దాఖలు చేశారు.