సోషల్ మీడియాలో రోజుకో వీడియో వెలుగు చూస్తుంది. వేగంగా వెళ్తున్న కారు టాప్ పై ఓ కుక్క కూర్చున్న వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: నడుస్తున్న కారు టాప్ పై ఓ వీధి కుక్క కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ విషయమై జంతు ప్రేమికులు ఇండోర్ విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కదులుతున్న కారు పై కప్పుపై కుక్క ఉన్న వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు.
కదులుతున్న కారుపై కూర్చున్న కుక్క భయంతో కన్పించింది. అయితే ఒకరు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో జంతు ప్రేమికుల దృష్టికి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది.
ఈ నెల 26న ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ నగర్, సత్యసాయి స్వ్కేర్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుందని ఎనిమల్ యాక్టివిస్ట్ ప్రియాన్స్ జైన్ చెప్పారు. ఈ వీడియోను చూసిన తర్వాత విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా జైన్ తెలిపారని ఆ కథనం వివరించింది. ఈ విషయమై విచారణ చేస్తున్నామని విజయ్ నగర్ పోలీసులు ప్రకటించారు.