బైక్ పై రంగులు పూసుకున్న యువతులు: రూ.33 వేలు ఫైన్ వేసిన పోలీసులు

By narsimha lode  |  First Published Mar 26, 2024, 6:49 AM IST

బైక్ పై వెళ్తున్న యువతుల చర్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అంతేకాదు వారికి ఫైన్ కూడ వేశారు పోలీసులు.


న్యూఢిల్లీ: బైక్ పై వెళ్తూ  ఇద్దరు యువతులు రంగులు పూసుకుంటున్న వీడియో ఓకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ వీడియోలో  యువతులు వ్యవహరించిన తీరుపై చర్చ సాగుతుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో  స్కూటీని ఓ వ్యక్తి నడుపుతుండగా ఇద్దరు యువతులు  స్కూటీ వెనుక వైపు ఎదురెదురుగా కూర్చున్నారు. హోలీని పురస్కరించుకొని   యువతులు రంగులు పూసుకున్నారు.  గోలియోన్ కి రాస్లిలా రామ్ లీలా చిత్రంలోని  అంగ్ లగా దే పాటకు అనుగుణంగా యువతులు రంగులు పూసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.ఈ వీడియో వైరల్ గా మారడంతో  పోలీసులు వీరికి రూ.33 వేల జరిమానాను విధించారు.

Latest Videos

ఈ విషయమై ఈ చలాన్ జారీ చేసినట్టుగా  పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్టుగా  సోషల్ మీడియా వేదికగా పోలీసులు ప్రకటించారు.

 


गाड़ी नंबर - (UP16C - X0866)
बिना हेलमेट इए ड्राइविंग ट्रिपिंलिंग और स्टंट किया जा रहा है आपसे अनुरोध है इन लोगो पर करएवाही करें pic.twitter.com/FpJXzGWtfr

— Shiekh Mohd Aqib (@Mohd_Aqib9)

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి  బైక్ పై రంగులు పూసుకుంటున్న యువతులకు  జరిమానా విధించిన పోలీసులకు పలువురు నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.  ఈ వీడియోలోని వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు  కోరారు.

మూడు రోజుల క్రితం ఢిల్లీ మెట్రో రైలులో కూడ  ఇద్దరు యువతులు ఇదే తరహాలో  రంగులు పూసుకుంటున్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో  డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేశారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైలు అధికారులు స్పందించారు.

click me!