పార్లమెంట్ ఎన్నికలకు దూరం, మద్దతు లేదు: రజనీకాంత్

Published : Feb 17, 2019, 11:06 AM IST
పార్లమెంట్ ఎన్నికలకు దూరం, మద్దతు లేదు: రజనీకాంత్

సారాంశం

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే  తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.  


చెన్నై: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే  తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.  

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై రజనీకాంత్ ఆదివారం నాడు స్పష్టత ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యంగానే తమ పార్టీ పోటీ చేస్తోందని రజనీకాంత్  చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ  ఏ పార్టీకి కూడ మద్దతును ఇవ్వదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ, అభ్యర్థులు కూడ తన ఫోటోలను, గుర్తులను వాడుకోకూడదని ఆయన కోరారు.  ప్రజల సమస్యల్ని తీర్చడంలో ముందుండేవారిని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారిని ఎన్నుకోవాలని రజనీకాంత్ సూచించారు.

ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు.

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ