పుల్వామా ఘటన మరువకముందే మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఆర్మీ మేజర్ మృతి

Published : Feb 16, 2019, 08:03 PM IST
పుల్వామా ఘటన మరువకముందే మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఆర్మీ మేజర్ మృతి

సారాంశం

నివారం నౌషరా సెక్టార్‌ సమీపంలోని ఎల్‌ఓసీ వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్‌ ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసి ఉంటారని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.   

రాజౌరి: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన మరువక ముందే మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. ఫిబ్రవరి 14న 44 మందిని బలితీసుకున్న ఉగ్రవాదులు మరోసారి ఐఈడీతో దాడికి ప్రయత్నించారు. భారత నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఓ పేలుడులో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. 

శనివారం నౌషరా సెక్టార్‌ సమీపంలోని ఎల్‌ఓసీ వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్‌ ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసి ఉంటారని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. 

నౌషరా సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వెలుపల 1.5కిలోమీటర్ల దూరంలో ఈ ఐఈడీని అమర్చినట్లు గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రత గురించి కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించిన గంటల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. 

ఇకపోతే ఈనెల 14న సెలవుల నుంచి విధుల్లో చేరేందుకు వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో దాదాపు 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

ప్రపంచం మెుత్తం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోన్న సమయంలో మరోసారి దాడికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల దాడికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ను హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Indian Railways Free AC Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?