అందుకే ఆదిల్ ఉగ్రవాదిగా మారాడు: సూసైడ్ బాంబర్ తండ్రి

By Arun Kumar PFirst Published Feb 16, 2019, 1:45 PM IST
Highlights

పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైన్యంపై మానవ బాంబుతో తెగబడి సైనికకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడిలో 44 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ మన దేశానికి చెందిన యువకున్నే మానవ బాంబుగా వాడుకుంది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువకుడు ఆదిల్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే తన కొడుకు ఉగ్రవాదిగా మారడానిని భారత సైనికుల అమానుష చర్యే కారణమని ఉగ్రవాది తండ్రి గులామ్‌ హసన్‌ దర్ తెలిపారు. 
 

పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైన్యంపై మానవ బాంబుతో తెగబడి సైనికకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడిలో 44 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ మన దేశానికి చెందిన యువకున్నే మానవ బాంబుగా వాడుకుంది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువకుడు  ఆదిల్ అహ్మద్ దర్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే తన కొడుకు ఉగ్రవాదిగా మారడానిని భారత సైనికుల అమానుష చర్యే కారణమని ఉగ్రవాది తండ్రి గులామ్‌ హసన్‌ దర్ తెలిపారు. 

ఆదిల్ చిన్నతనంలో భారత సైనికులు అతడిపట్ల దురుసుగా ప్రవర్తించారని...దాని వల్లే అతడు ఉగ్రవాదం వైపు అడగులు వేసి వుంటాడని హసన్ దార్ పేర్కోన్నారు. తమ కొడుకు ఆదిల్ ఓ రోజు స్కూల్ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఓ సైనిక దళం అతన్ని అడ్డుకుని అమానుషంగా ప్రవర్తించిందని గుర్తుచేశారు. తన కొడుకు తప్పేమీ లేకున్నా ముక్కు నేలకు రాయించి తమ వాహనం చుట్టూ తిరగమని సైనికుల అవమానించారని వెల్లడించారు. ఇలా తనను అవమానించి భారత సైనికులపై ఆదిల్ ద్వేషాన్ని పెంచుకున్నాడని తండ్రి వెల్లడించాడు. 

వివిధ సందర్భాల్లో భారత సైన్యంపై ద్వేషాన్ని ప్రదర్శించేవాడని హసన్‌దర్ పేర్కొన్నాడు. దీన్ని గుర్తించిన ఉగ్రవాద సంస్థ అతన్ని రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మలుచుకున్నారని తెలిపారు. కానీ తమ కొడుకు ఇంత దారుణానికి పాల్పడతాడని ఊహించలేదని హసన్‌దర్ అన్నారు.  
 

click me!