చెన్నై ‘లవ్ స్టోరీ’.. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువతిని తీసుకెళ్లి చంపే ప్రయత్నం... !!

By AN TeluguFirst Published Oct 21, 2021, 8:58 AM IST
Highlights

తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన సెల్వన్ (29) అనే యువకుడు ఇళమతి (23) అనే యువతి ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి Castes వేరు కావడంతో ఇరు కుటుంబాలు వీరి ప్రేమను Oppose చేసాయి. 

చెన్నై : అచ్చు సినిమాను తలపించే ఘటన తమిళనాడులో జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను తల్లిదండ్రులు వేధించడం, యువతిని బలవంతంగా లాక్కెళ్లడం, చంపాలనుకోవడం.. ఇవన్నీ ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ సినిమాను తలపిస్తున్నాయి. 

నిజ జీవితంలో సమాజంలో జరిగే రకరకాల సంఘటను సినిమాలుగా మారిన తరువాత జనబాహుళ్యంలో ప్రాచుర్యం సంపాదించుకుంటాయి. ఆ తరువాతే అలాంటి సంఘటనల సమాజంలో ఫోకస్ పెరుగుతుంది. అంతకుముందు నుండీ అలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నా.. సినిమా అధికంగా ప్రభావం చూపించగలుగుతుంది.

అలాంటి సంఘటనే చెన్నైలో ఒకటి జరిగింది. వివరాల్లోకి వెడితే.. తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన సెల్వన్ (29) అనే యువకుడు ఇళమతి (23) అనే యువతి ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి Castes వేరు కావడంతో ఇరు కుటుంబాలు వీరి ప్రేమను Oppose చేసాయి. 

దాంతో కన్న వాళ్ళని కాదనుకుని ఇద్దరు కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి Marriage చేసుకున్నారు. ఇద్దరు కొద్ది నెలల పాటు సంతోషంగా జీవించారు. అయితే,  ఎక్కడ కాపురం పెట్టారో తెలుసుకున్న యువతి కుటుంబం  యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్ళింది. 

ఈ ఘటనలో తీవ్ర మనోవేదన చెందిన సెల్వన్  తన భార్యను తీసుకెళ్లిపోయారు అని తాము మేజర్ల మని… Love marriage చేసుకున్నామని పోలీసులకు తెలిపాడు.

aiadmkకు చెందిన మాజీ మంత్రికి  ఇళమతి కుటుంబానికి ఉన్న  సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని సెల్వన్ ఆరోపించాడు.  తన భార్య ఇళమతి నుంచి ఇటీవల సెల్వం కు వాట్సాప్ లో తనను చంపాలని చూస్తున్నారని కాపాడాలంటూ మెసేజ్ వచ్చింది. 

 దాంతో ఆ యువకుడు మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు.  తన భార్యకు Life threat ఉందని ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  ఈ కేసులో విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

చారిత్రాత్మక విజయం.. వందకోట్ల మార్క్ ను దాటబోతున్న టీకాడ్రైవ్.. సంబరాలకు అంతా సిద్ధం..

కూతురు తమ కులం కాని వ్యక్తిని పెళ్లిచేసుకుందని, తక్కువ కులం వారితో తిరుగుతుందని, ప్రేమించిందని ఇలా రకరకాల కారణాలతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతుర్లను చంపుకునే పాశవిక పరువు హత్యలు కొత్త విషయం ఏమీ కాదు. 

ప్రాంతంలో సంబంధం లేకుండా ఇది దేశ మంతటా జరుగుతూనే ఉంది. మిర్యాలగూడ మారుతీరావు కేసు ఇంకా మరిచిపోలేదు. కూతురు అమృత దళితుడైన ప్రణయ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుందని.. హత్య చేయించి.. ఆ తరువాతి పరిణామాల్లో అతనూ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి రాష్ట్రాన్నే కాదు మొత్తం దేశాన్నీ కుదిపేసిన సంగతి తెలిసిందే. 

సెల్వన్ కేసు మరో అమృత, ప్రణయ్ ల కేసులా కాకూడదని, పోలీసులు ఈ కేసులో త్వరితగతిన దర్యాప్తు చేసి.. న్యాయం చేయాలని కోరుకోవాలి. 

click me!