భార్యపై అనుమానం.. ఎనిమిదేళ్ల కూతురి గొంతు కోసి చంపిన తండ్రి...

By AN TeluguFirst Published Nov 1, 2021, 10:26 AM IST
Highlights

కోపోద్రిక్తుడైన అతను వంటగదికి వెళ్లి కత్తిని తీసుకొని ఆ చిన్నారి భుజం, చేతులపై పొడిచాడు. ఆ బాధను తట్టుకోలేక చిన్నారి పెద్దగా ఏడవడం ప్రారంభించింది. రాధాకృష్ణన్ ఆమెను అరవొద్దని గద్దించాడు. కానీ ఆ చిన్నారికి నొప్పి తీవ్రంగా ఉండడంతో అరుస్తూనే ఉంది. దీంతో అరుపులు ఆపాలని రాధాకృష్ణన్ ఆమె గొంతు కోశాడు. 

చెన్నై: తల్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో ఓ వ్యక్తి తన కుమార్తెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన శనివారం రాత్రి విల్లివాక్కంలో చోటుచేసుకుంది.

నిందితుడు, విల్లివాక్కంకు చెందిన 34 ఏళ్ల రాధాకృష్ణన్ కు కొన్నేళ్ల క్రితం లావణ్య(30)ను వివాహం చేసుకున్నాడు. ఆమె నర్సుగా పనిచేస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరిదీ Love marriage అని పోలీసులు తెలిపారు.

కాగా, గత కొంతకాలంగా రాధాకృష్ణన్ తన భార్యపై 
Suspicion పెంచుకున్నాడు. ఆమెకు Extramarital affair ఉందని అనుమానించసాగాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో తట్టుకోలేక అతడిని విడిచిపెట్టి.. లావణ్య గత మూడు నెలలుగా తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవించడం ప్రారంభించింది.

రాధాకృష్ణన్ రాజీ కోసం తన భార్యను సంప్రదించగా ఆమె నిరాకరించిందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి తన పిల్లలను వదిలి లావణ్య 
Night shiftకి ఆస్పత్రికి వెళ్లింది. ఆమె వెళ్లిన రెండు నిమిషాల తర్వాత, రాధాకృష్ణన్ ఆమెను కలవడానికి ఆమె ఉంటున్న ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో లావణ్య లేదు. పిల్లలు ఒంటరిగా ఉన్నారు.

దీంతో అనుమానం మరింత పెరిగిన రాధాకృష్ణన్ తన ఎనిమిదేళ్ల కుమార్తెను అనుచితమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు, కానీ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. తండ్రి అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వలేదు. తాను లేని సమయంలో తన తల్లి ఇంటికి ఎవరైనా వస్తే.. తనతో చెప్పాలని 
Girlను ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు.

అయితే తండ్రి అడుగుతున్న దేనికీ ఆ చిన్నారి సరిగా స్పందించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అతను వంటగదికి వెళ్లి కత్తిని తీసుకొని ఆ చిన్నారి భుజం, చేతులపై పొడిచాడు. ఆ బాధను తట్టుకోలేక చిన్నారి పెద్దగా ఏడవడం ప్రారంభించింది. రాధాకృష్ణన్ ఆమెను అరవొద్దని గద్దించాడు. 

కానీ ఆ చిన్నారికి నొప్పి తీవ్రంగా ఉండడంతో అరుస్తూనే ఉంది. దీంతో అరుపులు ఆపాలని రాధాకృష్ణన్ ఆమె గొంతు కోశాడు. అయితే, అప్పటికే బాలిక కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకున్నారు. ఇరుగుపొరుగు వారిని గమనించిన రాధాకృష్ణ తప్పించుకున్నాడు.

కూతురిపై అత్యాచారయత్నం.. భర్తపై మహిళా డాక్టర్ ఫిర్యాదు..

కూతురి పరిస్థితి గురించి ఇరుగుపొరుగు వారు లావణ్యకు సమాచారం అందించారు. బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. Murder చేసినట్లు ఒప్పుకోవడంతో రాధాకృష్ణన్ విల్లివాక్కం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

గత కొన్ని రోజులుగా తన భార్య ప్రవర్తన పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని పోలీసులకు తెలిపాడు. కూతురు తన ప్రశ్నలలో దేనికీ ప్రతిస్పందించడంలో విఫలమైనందున అతను నిరాశకు గురయ్యాడు. 

"తాను లేనప్పుడు ఎవరైనా ఇంటికి వెళుతున్నారో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. అది తెలియకపోవడంతో నిరాశ తో, అశాంతిగా ఉన్నాడు. ఈ సమయంలోనే చిన్నారి అతను అడిగిన వాటికి సమాధానం ఇవ్వలేకపోయింది’’ అని విచారణ అధికారి తెలిపారు. బాలిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. రాధాకృష్ణన్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

click me!