కూతురిపై అత్యాచారయత్నం.. భర్తపై మహిళా డాక్టర్ ఫిర్యాదు..

Published : Nov 01, 2021, 09:56 AM IST
కూతురిపై అత్యాచారయత్నం.. భర్తపై మహిళా డాక్టర్ ఫిర్యాదు..

సారాంశం

నలిని, తన కూతురు సునిధితో తన గదిలో నిద్ర పోతూ ఉండగా..  అర్ధరాత్రి డాక్టర్ నళినికి తన కూతురు అరుపులు వినిపించాయి.దీంతో  ఆమె ఒక్కసారిగా  నిద్ర లేచి చూడగా పక్కన అమ్మాయి కనిపించలేదు. గది నుంచి బయటకు వచ్చి చూడగా ప్రకాష్ తన కూతురు చేయి పట్టుకుని ఉన్నాడు.

రాజస్థాన్ : మనిషిలో మృగవాంఛలు పెరిగి వావివరుసలు మరచిపోతే అతడు పశువుతో సమానం. అలాంటి తత్వంతో ప్రవర్తించాడు ఒక డాక్టర్.  మన సమాజంలో డాక్టర్ అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి తనకు కూతురు లాంటి అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అంటూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది ఇంకా బైటికి తెలియలేదు..

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ నగరంలోని ట్రాన్స్పోర్ట్ నగర్ లో నివసించే డాక్టర్ ప్రకాష్ (55) (పేరు మార్చబడింది) మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తరువాత 2010లో తన ఆసుపత్రిలోనే పని చేసే డాక్టర్ నళిని(పేరు మార్చబడింది)ని marriage చేసుకున్నాడు.

ఆమెకు ఒక కూతురు సునిధి(పేరు మార్చబడింది) ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయికి 17 ఏళ్లు.  పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత నళిని, ప్రకాష్ ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ గొడవ పడేవారు. ఇదిలా ఉండగా... ఇటీవల అక్టోబర్ 29న నలిని, తన కూతురు సునిధితో తన గదిలో నిద్ర పోతూ ఉండగా..  అర్ధరాత్రి డాక్టర్ నళినికి తన కూతురు అరుపులు వినిపించాయి.

 దీంతో  ఆమె ఒక్కసారిగా  నిద్ర లేచి చూడగా పక్కన అమ్మాయి కనిపించలేదు. గది నుంచి బయటకు వచ్చి చూడగా ప్రకాష్ తన కూతురు చేయి పట్టుకుని ఉన్నాడు. నళిని అక్కడికి రావడంతో ప్రకాష్ చేయి విడిపించుకుని సునిధి తన తల్లి  నలినినీ  పట్టుకొని ఏడ్చేసింది.

స్టూడెంట్ పై అత్యాచారం.. పదమూడేళ్ల తరువాత మాజీ ఎమ్మెల్యేకు జైలుశిక్ష..

ప్రకాష్ తనపై rape attempt చేయబోయాడు అని చెప్పింది. ఆ తర్వాత డాక్టర్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు డాక్టర్ నలిని తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్ ప్రకాష్ దేశం వదిలి త్వరలో  పారిపోతున్నాడని, అతనిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు చెప్పింది.

అయితే, పోలీసులు ఇంకా డాక్టర్ ప్రకాష్ పై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. డాక్టర్ నలిని చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన తర్వాతే నిజం బయట పడుతుందని పోలీసులు అంటున్నారు. డాక్టర్ ప్రకాష్ ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు. 

చిత్తూరులో దారుణం...

రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురి (14)పై ఓ తండ్రి rape చేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో  Medical examinationల కోసమని అక్టోబర్ 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 

ఆ పై రేణిగుట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి ఆలస్యంగా చెప్పడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu