365 రోజులు షాపులు తెరిచే వుంటాయి: తమిళ సర్కార్ ప్రయోగం

By Siva KodatiFirst Published Jun 6, 2019, 2:54 PM IST
Highlights

భారతదేశంలో ఒక స్థాయి పట్టణం నుంచి మెట్రోసిటీ వరకు షాపింగ్ అంటే ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఒక గంట అధికంగా ఉంటే ఉండొచ్చు. 

భారతదేశంలో ఒక స్థాయి పట్టణం నుంచి మెట్రోసిటీ వరకు షాపింగ్ అంటే ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఒక గంట అధికంగా ఉంటే ఉండొచ్చు.

అలాంటి ఏకంగా 24 గంటల పాటు షాపింగ్ మాల్స్ తెరిచే ఉంచితే. తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు ప్రయోగానికి సిద్ధమైంది. ఇకపై దుకాణాలు, షాపింగ్ మాల్స్ 24 గంటల పాటు తెరిచే ఉంచుకోవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది.

వాణిజ్య, వ్యాపార అభివృద్ధితో పాటు మహిళా ఉద్యోగుల భద్రతపై కూడా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

2016లో దుకాణాలు మరియు విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబంధించిన నిబంధనల చట్టాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా పలు పరిశ్రమలు వారంలో 7 రోజుల పాటు 24 గంటలు పనిచేయవచ్చు.

ఈ చట్టాన్ని అలాగే అమలు చేసుకోవచ్చు లేకపోతే.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని కూడా అందులో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను మార్చుకోవచ్చు.

ఇప్పటికే మహారాష్ట్ర 24 గంటలు పని చేసేలా నిబంధనలను మార్చుకుంది. ఇప్పుడు తమిళనాడు కూడా ఆ జాబితాలో చేరింది. తమిళనాడులోని సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా అన్ని రకాల పరిశ్రమలు నిరంతరాయంగా 24 గంటలు పని చేయవచ్చు. 

click me!