తమిళనాడు రాజ్ భవన్ లో మరో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ బుధవారం నాడు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. రాజ్ భవన్ లో మొత్తం కరోనా బారినపడినవారి సంఖ్య 87కి చేరుకొంది.
చెన్నై: తమిళనాడు రాజ్ భవన్ లో మరో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ బుధవారం నాడు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. రాజ్ భవన్ లో మొత్తం కరోనా బారినపడినవారి సంఖ్య 87కి చేరుకొంది.
వారం రోజుల పాటు ఆయన స్వీయ నిర్భందంలో ఉండనున్నారు. గతవారంలో రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులను పరీక్షిస్తే 84 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది.
undefined
also read:రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా: క్వారంటైన్‌కి తరలింపు
కరోనా బారినపడిన వారిలో ఎక్కువ మంది ఫైర్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టుగా రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడడంతో గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ఇవాళ్టి నుండి వారం రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండనున్నారు.
గవర్నర్ కు మంగళవారం నాడు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గవర్నర్ పూర్తి ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే వైద్యులు గవర్నర్ కు పరీక్షలు చేశారు.వైద్యుల సూచన మేరకు గవర్నర్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.