Tamil Nadu: “స్కాన్ చేయండి.. స్కామ్ చూడండి”.. ప్రధాని మోడీపై డీఎంకే పోస్టర్ దాడి..

By Rajesh Karampoori  |  First Published Apr 12, 2024, 11:57 AM IST

Tamil Nadu: లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకపోతున్నాయి. ఈ తరుణంలో తమిళనాట బీజేపీని టార్గెట్‌గా చేస్తూ అధికార డీఎంకే పోస్టర్ల ప్రచారం జరుగుతోంది. వెల్లూరులో జరిగిన ర్యాలీలో అధికార డీఎంకేపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజు ఈ పోస్టర్లు వెలుగు చూడటం గమనార్హం.


Tamil Nadu: పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హ్యాట్రిక్ విజయం సాధించి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాని చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాలపై కమలం పార్టీ కన్నేసింది. ప్రధానంగా తమిళనాట కాషాయ జెండా ఎగరవేయాలని వ్యూహారచన చేస్తుంది అధికార బీజేపీ. అందులో భాగంగానే స్వయంగా ప్రధాని మోడీనే రంగంలో దిగారు. దీంతో తమిళనాట అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని వెల్లూరులో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార డీఎంకే అవినీతిపై గుత్తాధిపత్యం ఉందని, విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డిఎంకె , దాని మిత్రపక్షం కాంగ్రెస్ .. ప్రజా సంక్షేమం కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. అవినీతిపై మొదటి కాపీరైట్‌ను డిఎంకె సంపాదించుకుందనీ, ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె తమిళనాడును లూటీ చేస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. 

Latest Videos

నేడు దేశం 5G (టెలికమ్యూనికేషన్)లో ప్రపంచ రికార్డును సృష్టిస్తోంది, కానీ 2G స్కామ్‌తో డిఎంకె చెడ్డపేరు తెచ్చుకుందనీ విమర్శించారు. అవినీతిపరులను రక్షించడానికి కాంగ్రెస్, డిఎంకెలు ముందంజలో ఉంటాయనని, తమ ప్రభుత్వం అవినీతిని తొలగిస్తుంటే..  కాంగ్రెస్, దాని మిత్ర కూటమి మాత్రం అవినీతిపరులను రక్షిస్తుందని ఆయన అన్నారు. డీఎంకే నేతలు ఏ రాజా, కనిమొళి వంటి వారు 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో నిందితులుగా ఉన్నారని విమర్శంచారు.

ప్రధాని మోడీపై  డీఎంకే పోస్టర్ల దాడి

ఈ తరుణంలో బీజేపీని టార్గెట్‌ చేస్తూ అధికార డీఎంకే పోస్టర్ల ప్రచారానికి తెర తీసింది. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందంటూ తమిళనాడులోని పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. పోస్టర్‌లపై పైభాగంలో “జీ పే” అని రాసి, దానిపై ప్రధాని మోదీ ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంది. “స్కాన్ చేయి..  స్కామ్‌ని చూడు” అని రాసి ఉంది. పోస్టర్లు సంచలనం సృష్టించాయి. పోస్టర్లపై మోదీ చిత్రం ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. బీజేపీ కుంభకోణాలు అంటూ వాయిస్ ఓవర్‌తో కూడిన వీడియో ప్లే అవుతోంది. దాదాపు  ఒక నిమిషం 30 సెకన్ల నిడివి గల వీడియో ప్లే అవుతుంది. తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యాటన ముగిసిన మరుసటి రోజు ఈ పోస్టర్లు వెలుగు చూడటం గమనార్హం. 

click me!