Video Viral: ఆపరేషన్ చేస్తూ డాక్టర్లు బిజీ.. డ్యాన్స్ చేస్తూ చిన్నారి రోగి సందడి !

By Rajesh KarampooriFirst Published Apr 11, 2024, 7:07 PM IST
Highlights

Video Viral:పంజాబ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసక్తికర ఘటన జరిగింది. శస్త్రచికిత్స చేయించుకునేందుకు భయపడుతున్న ఓ చిన్నారి దృష్టి మరల్చేందుకు ఓ డాక్టర్ ప్లే చేసిన ట్రిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి జనాలు డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 

Video Viral: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినా అతని క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన గాత్రం,పాటలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఎంతలా అంటే.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారికి వైద్యం అందజేస్తుండగా.. అతడి దృష్టి మరల్చేందుకు వైద్యుడు ఆపరేషన్ థియేటర్‌లో సిద్ధూ మూసేవాలా పాటను ప్లే చేశాడు. ఆ పాటను వినగానే మంచంపై పడుకున్న పిల్లవాడు తన బాధను మరిచిపోయి..  చేతులు పైకెత్తి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన మీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 

వివరాల్లోకెళ్తే.. పంజాబ్ లూథియానాలోని జాగ్రావ్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో సుదర్శన్ అనే 7 ఏళ్ల చిన్నారి గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆ పిల్లవాడు తల్లి మరణించగా.. ఆ చిన్నారి తండ్రి గురుప్రేమ్ సింగ్ వికలాంగుడయ్యారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని ఫరీద్‌కోట్‌కు రెఫర్ చేశారు. దీంతో ఆ చిన్నారి అమ్మమ్మ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీని సంప్రదించింది. సొసైటీ పిల్లల కేసును జాగ్రావ్‌లోని సుఖ్‌వీన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ దివ్యాంశు గుప్తాకు అప్పగించింది. ఆపరేషన్ గురించి వినగానే పాప భయంతో ఏడవడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ దివ్యాన్షు గుప్తా ఒక ఆలోచనతో ఆలోచించాడు. పిల్లల దృష్టిని మరల్చడానికి, అతను మూసేవాలా పాట 'జట్ కి మాషుక్ బిబా రాషియా తో' ప్లే చేసాడు. దీంతో ఆ పాటను విన్న చిన్నారి తనకు ఆపరేషన్ అవుతోందనే బాధను, భయాన్ని మరిచిపోయినా ఆ చిన్నారి చేతులు పైకెత్తి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ వైద్యులు తేలికగా చికిత్స చేయడం ప్రారంభించారు.  
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఆ పాటకు తగ్గట్టుగా చిన్నారి డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా సిబ్బంది వీడియో తీసి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు శిశువు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ చికిత్స చేసిన విధానాన్ని కూడా ప్రశంసించారు. ఈ ఆపరేషన్ సమయంలో వచ్చిన కొత్త ఆలోచన ఇంత వైరల్ అవుతుందని నాకు తెలియదని సుఖ్‌వీన్ హాస్పిటల్ హెడ్ డాక్టర్ దివ్యాంశు గుప్తా అన్నారు. రోగికి నొప్పి కలగకుండా సరైన సమయంలో సరైన చికిత్స అందించడమే నా లక్ష్యమని అన్నారు.
 

click me!