కరోనాతో తమిళనాడులో కాంగ్రెస్ అభ్యర్ధి మృతి: గెలిస్తే ఉప ఎన్నికే

By narsimha lodeFirst Published Apr 11, 2021, 12:00 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పీఎస్‌డబ్ల్యు మాధవరావు కరోనాతో మరణించారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీవిల్లిపుత్తూరు అసెంబ్లీ స్థానం నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు.

చెన్నై:అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పీఎస్‌డబ్ల్యు మాధవరావు కరోనాతో మరణించారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీవిల్లిపుత్తూరు అసెంబ్లీ స్థానం నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు.ఈ నెల 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మాధవరావు మరణించారు.

గత మాసంలో మాధవరావుకు కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు.ఈ స్థానానికి ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన మరణించారు. దీంతో ఉప ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. అయితే ఈ స్థానం నుండి ఆయన విజయం సాధిస్తే మాత్రం ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటాయి.

కరోనాతో కాంగ్రెస్ నేత మాధవరావు మరణించడంపై ఎఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ తీవ్ర సంజయ్ దత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలిపారు.తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. 
 

click me!