తమిళనాడు: ఆధిక్యంలో సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం

By narsimha lodeFirst Published May 2, 2021, 9:36 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి  పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు  తమ నియోజకర్గాల్లో ఆధిక్యంలో నిలిచారు.
 

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి  పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు  తమ నియోజకర్గాల్లో ఆధిక్యంలో నిలిచారు.రాష్ట్రంలోని ఎడప్పాడి నుండి సీఎం పళనిస్వామి పోటీ చేశారు. బోడినాయక్కనూర్ లో మాజీ సీఎం పన్నీరు సెల్వం పోటీ చేశారు. ఈ ఇద్దరు కూడ  తమ ప్రత్యర్థులపై ఆధిక్యంలో నిలిచారు.  జయలలిత మరణం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పళనిస్వామి అన్నాడిఎంకె ఎన్నికల బాధ్యతను తన భుజాన వేసుకొన్నారు. 

 ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది. ఉన్న మొత్తం సీట్లలో డీఎంకే కూటమి 10-20 సీట్లను సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి.

 ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే సాగింది.  
డీఎంకే, కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉంది. 

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి.

click me!