నందిగ్రామ్: ఫలితంపై హైడ్రామా, ఫలితాన్ని ప్రకటించని ఈసీ

By telugu teamFirst Published May 2, 2021, 8:48 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నందిగ్రామ్ లో టీఎంస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సువేందుపై వెనకబడి ఉన్నారు.

నందిగ్రామ్ ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. ఈసీ అధికారిక ప్రకటన చేసే వరకు ఫలితంపై ఊహాగానాలు వద్దని మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ట్వీట్ చేసింది. ఫలితాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా లెక్కింపు జరుగుతోందని ఈసీ చెబుతోంది. కాగా, నందిగ్రామ్ లో తన ఓటమిని మమతా బెనర్జీ అంగీకరించారు. తొలుత మమతా బెనర్జీ 1200 ఓట్ల తేాడతో మమతా గెలిచినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మమతపై సువేందు అధికారి 1622 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు తెలిపారు. మొత్తంగా నందిగ్రామ్ ఫలితంపై తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ఫలితం తిరగబడింది. నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. సువేందు అధికారిపై 1622 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. 

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ శాసనసభ స్థానంలో నరాల ఉత్కంఠను రేకెత్తిస్తూ మెజారిటీ దోబూచులాడుతూ వచ్చింది. చివరికి అత్కంఠకు తెరపడింది. తన సమీప బిజెపి ప్రత్యర్థి సువేందు అధికారిపై మమతా బెనర్జీ దాదాపు 1622 ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు నుంచి నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సుదేందు అధికారి 81 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఆయన బిజెపి తరఫున పోటీ చేసి మమతా బెనర్జీపై అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించారు. మమతా బెనర్జీ తొడగొట్టి నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. సుదేందు అధికారికి నందిగ్రామ్ పెట్టని కోట అయినప్పటికీ మమతా బెనర్జీ వెనకంజ వేయలేదు. సవాల్ గా తీసుకుని అక్కడి నుంచి పోటీ చేశారు

 నందిగ్రామ్ లో మమతా బెనర్జీ 17వ రౌండ్ ఓట్ల లెక్కింపులో 820 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. నందిగ్రామ్ లో 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మమతా బెనర్జీ సువేందుపై 6 ఓట్లు వెనకపడి ఉన్నారు. నందిగ్రామ్ ఎన్నిక ట్వంటీ20 మ్యాచును తలపిస్తోంది. చివరి 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రౌండ్ జయాపజయాలను తెల్చనుంది.

పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ లో మమతా బెనర్జీ సువేందు అధికారిని మరింత వెనక్కి నెట్టారు. ప్రస్తుతం మమతా సువేందుపై 8 వేలకు పైగా మెజారిటీతో సాగుతున్నారు.

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ఆధిక్యత దోబూచులాడుతోంది. సువేందు అధికారిపై మమతా బెనర్జీ మళ్లీ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు ఆమె ప్రస్తుతం సువేందుపై 2331 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మరోసారి నందిగ్రామ్ లో మమతా బెనర్జీ వెనకంజలో పడ్డారు. సువేందు అధికారి మమతపై 3 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు. సువేందు అధికారి మమతపై 3,800 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ లో మరోసారి ముందంజలోకి వచ్చారు. ఆమె సువేందు అధికారిపై 1500 ఓట్ల మెజారిటీ సాధించారు. 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆమె ఆధిక్యంలోకి వచ్చారు.

నందిగ్రామ్ లో 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మమతా బెనర్జీ సువేందు అధికారిపై 9,900 ఓట్ల తేడాతో వెనబడి ఉన్నారు.

మమతా బెనర్జీ నందిగ్రామ్ లో మరోసారి వెనకంజలో పడ్డారు. సువేందు అధికారి 8,800 ఓట్ల మెజారిటీలోకి వచ్చారు. ఆరో రోండులో మాత్రమే మమతా స్వల్ప మెజారిటీ సాధించారు.

నందిగ్రామ్ లో తొలిసారి ముఖ్మమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆమె తన సమీప బిజెపి ప్రత్యర్థిపై 1,427 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. తొలి ఆరు రౌండ్లలో సువేందు ఆధిక్యం కొనసాగించగా, ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి మమతా స్వల్ప మెజారిటీలోకి వచ్చారు.

నందిగ్రామ్ లో మరోసారి బిజెపి అభ్యర్థి సువేందు అధికారి పుంజుకున్నారు. ఆయనపై మమతా బెనర్జీ 7 వేల తేడాతో వెనకబడి ఉన్నారు. సువేందు అధికారిపై ఆమె 7,262 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐదో రౌండు ఓట్ల లెక్కింపులో పుంజుకున్నారు. దీంతో ఆమె సమీప బిజెపి అభ్యర్థి ఆధిక్యం 3110 ఓట్లకు తగ్గింది.

నందిగ్రామ్ లో బిజెపి అభ్యర్థి సువేందు మమతా బెనర్జీపై 8 వేల ఆధిక్యంలో ఉన్నారు. మమతా బెనర్జీ 8,201 ఓట్ల తేడాతో వెనకబడి ఉన్నారు.

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ మూడో రౌండులో ప్రత్యర్థి సువేందుపై వెనకంజలో ఉన్నారు. ఆమె 7,287 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నారు.

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ మరోసారి సువేందుపై వెనకబడిపోయారు.  మమతా బెనర్జీ 4557 ఓట్ల తేడాతో సువేందుపై వెనకబడి ఉన్నారు.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. ఆమెపై బిజెపి అభ్యర్థి సువేందు ముందంజలో ఉన్నారు. మమతా బెనర్జీ తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు.

కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్ అభ్యర్థుల ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. 

ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. 
మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. 

ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేసారు. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు.

click me!