తెలంగాణ బాటలోనే తమిళనాడు రాష్ట్రం పయనిస్తోంది. టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులందరిని 11వ తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయంం తీసుకొంది ప్రభుత్వం.
చెన్నై:తెలంగాణ బాటలోనే తమిళనాడు రాష్ట్రం పయనిస్తోంది. టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులందరిని 11వ తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయంం తీసుకొంది ప్రభుత్వం.
also read:బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ఎగ్జామ్స్ లేకుండానే పాస్
undefined
టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా తమిళనాడు సీఎం పళనిస్వామి మంగళవారం నాడు ప్రకటించారు. రెండు నెలలుగా లాక్ డౌన్ తర్వాత పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం.
also read:టెన్త్ పరీక్షల నిర్వహణపై 8న కేసీఆర్ సమీక్ష: ఎగ్జామ్స్ ఉంటాయా, పాస్ చేస్తారా?
ఈ నెల 15వ తేదీ నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించాలని భావించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
చెన్నె సిటీలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో 10వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకొంది.
టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర విపక్ష నేత, డీఎంకె నేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా సీఎంను కోరారు.
విద్యార్థులు, ప్రజలను దృష్టిలో ఉంచుకొని సీఎం నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్ ఆ ట్వీట్ లో కోరారు.తెలంగాణ ప్రభుత్వం కూడ పదోతరగతి విద్యార్థులను పాస్ చేయాలని ఈ నెల 8వ తేదీన నిర్ణయం తీసుకొంది.
విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షనిర్వహించారు. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న మరునాడే తమిళనాడు రాష్ట్రం కూడ ఇదే నిర్ణయాన్ని తీసుకొంది.