కరోనాతో వ్యక్తి మృతి: డీజీపీ కార్యాలయం 48 గంటలు మూసివేత

By narsimha lode  |  First Published Jun 9, 2020, 5:15 PM IST

ఇవాళ్టి నుండి 48 గంటల పాటు హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కార్యాలయాన్ని మూసివేశారు. డీజీపీని కలిసిన ఓ వ్యక్తి కరోనాతో మరణించారు. దీంతో కార్యాలయాన్ని 48 గంటలపాటు మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.



సిమ్లా: ఇవాళ్టి నుండి 48 గంటల పాటు హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కార్యాలయాన్ని మూసివేశారు. డీజీపీని కలిసిన ఓ వ్యక్తి కరోనాతో మరణించారు. దీంతో కార్యాలయాన్ని 48 గంటలపాటు మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

వారం రోజుల క్రితం ఓ వ్యక్తి డీజీపీ సంజయ్ కుందును కలిశారు. డీజీపీని కలిసిన వ్యక్తి కరోనాతో మరణిండంతో డీజీపీ హోం క్వారంటైన్‌కి వెళ్లారు. అంతేకాదు ఆయన నుండి వైద్యులు శాంపిల్స్ సేకరించారు.

Latest Videos

సీతారామ్ మర్ది డీజీపీగా రిటైరైన తర్వాత సంజయ్ కుందు జూన్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కుందును ఆయన సన్మానించారు.ఆ వ్యక్తికి కరోనా సోకి జూన్ 9వ తేదీన మరణించినట్టుగా ఎస్పీ కుషల్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. 

కరోనా సోకిన వ్యక్తి డీజీపీ కార్యాలయంతో పాటు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యులతో పరీక్షలు చేయించిన వారంతా హోం క్వారంటైన్ లో ఉంటారని శర్మ ప్రకటించారు. డీజీపీ కార్యాలయంలో 200 మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారు.

also read:బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు తల్లికి కూడా కరోనా

అదనపు డైరెక్టర్ జనరల్, లా అండ్ ఆర్డర్ కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాదు అదనపు డీజీపీ, ఐజీ, సాయుధ పోలీసులు, శిక్షణ విభాగంలో పనిచేసే ఐజీ ప్రధాన కార్యాలయం ఉంది, ఎస్పీ, సైబర్ క్రైమ్, ఎస్పీ, లా అండ్ ఆర్డర్ కార్యాలయాలు ఉన్నాయి. 

click me!