బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు తల్లికి కూడా కరోనా

By narsimha lode  |  First Published Jun 9, 2020, 3:29 PM IST

మాజీకేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. సింధియాతో పాటు ఆయన తల్లికి కూడ కరోనా సోకింది.


న్యూఢిల్లీ: మాజీకేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. సింధియాతో పాటు ఆయన తల్లికి కూడ కరోనా సోకింది.బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన తల్లిని దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.

బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడ దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.
కరోనా లక్షణాలతో నాలుగు రోజుల క్రితం వీరిద్దరూ ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు.

Latest Videos

undefined

also read:మూడు రోజులుగా అస్వస్థత: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలు

జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలింది. మరోవైపు ఆయన తల్లికి మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్టుగా రిపోర్టుల్లో తేలలేదు. 

బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పత్రా కూడ కరోనా వైరస్ లక్షణాలు కన్పించారు. గురుగ్రామ్ లోని మెదంగా ఆసుపత్రిలో ఆయన చేరారు. సోమవారం నాడు ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడ మూడు రోజులుగా అస్వస్థతగా ఉన్నారు. ఇవాళ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు గానీ కేజ్రీవాల్ శాంపిల్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది మే 10వ తేదీన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  18 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగారు.జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పనిచేశారు. 
 

click me!