భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్న తాలిబాన్లు

Published : Mar 14, 2023, 06:31 PM IST
భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్న తాలిబాన్లు

సారాంశం

భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో తాలిబాన్లు పార్టిసిపేట్ చేయడానికి ఓ లేఖ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ పరిధిలో ఓ ఆన్‌లైన్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇందులో 160కిపైగా దేశాల నుంచి ఎన్‌రోల్‌మెంట్లు చేసుకున్నారు. ఇందులో ఆఫ్గనిస్తాన్ కూడా చేరడం ఆశ్చర్యకరంగా మారింది.  

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో తాలిబాన్లు పాల్గొనబోతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించబోతున్న ఓ ఆన్‌లైన్ కోర్సులో పాల్గొంటామని తాలిబాన్లు లేఖ పంపారు. ఈ కోర్సును కోళికోడ్ ఐఐఎం నిర్వహిస్తుంది. ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ)లో భాగంగా ఈ ఆన్‌లైన్ కోర్సును కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కింద కాండక్ట్ చేయబోతున్నారు. ఆఫ్గనిస్తాన్ సహా విదేశాలు ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు.

యాన్ ఇండియన్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌ను మార్చి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నట్టు ఐటీఈసీ వెబ్ సైట్ తెలిపింది. భారత్‌లో వ్యాపార వాతావరణం, సాంస్కృతిక వారసత్వం, రెగ్యులేటరీ ఇకోసిస్టమ్‌లపై లోతైన అవగాహన ఈ ఆన్‌లైన్ కోర్సు కల్పిస్తుంది.

కేంద్ర విదేశాంగ శాఖ పరిధిలో పని చేసే ఐటీఈసీ నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయడానికి 160కి పైగా దేశాల నుంచి సుమారు 2 లక్షల అధికారులు ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు.

Also Read: దొంగనోట్లు , నల్లధనం పెరిగాయి, ఒక్క లక్ష్యం నెరవేరిందా .. నోట్ల రద్దుతో ఒరిగిందేం లేదు : కేంద్రంపై హరీశ్ రావు

అఫ్గనిస్తాన్‌ విదేశాంగ శాఖ పరిధిలో పని చేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లమసీ లెటర్ హెడ్‌తో ఓ లేఖ బయటకు వచ్చింది. ఐటీఈసీ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి విజ్ఞప్తితో ఆ లేఖ ఉన్నది.

ఈ ప్రోగ్రామ్‌లో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. కానీ, తాలిబాన్ల నిర్ణయం మాత్రం సర్‌ప్రైజ్‌గా ఉన్నది. ఎందుకంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. అయితే, సంక్షోభంలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు మాత్రం భారత్ సహాయం అందిస్తున్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu