సినిమాల్లోని శ్వేతనాగు.. ఇంట్లో కనిపిస్తే..!!!

Published : Jul 03, 2018, 03:26 PM IST
సినిమాల్లోని శ్వేతనాగు.. ఇంట్లో కనిపిస్తే..!!!

సారాంశం

సినిమాల్లోని శ్వేతనాగు.. ఇంట్లో కనిపిస్తే..!!!

దివంగత సినీనటి సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమా చూసిన తర్వాత చాలామంది మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. ఇదంతా అభూత కల్పనా లేక నిజంగానే శ్వేతనాగులు సంచరిస్తాయా అని.. దీని గురించి నెట్టింట్లో చాలామంది వెతుకుతూనే ఉన్నారు. పాములపై పరిశోధన చేసే కొంతమంది మాత్రం ఇది కల్పన కాదని.. నిజంగానే శ్వేతనాగులు ఉన్నాయని ప్రకటించారు. అయితే తాజాగా ఈ అరుదైన సర్పం బెంగళూరులోని ఇంట్లో ప్రత్యక్షమైంది..

మథికెర ప్రాంతంలోని ఓ  ఇంట్లోకి ప్రవేశించిన పామును చూసి ఆ ఇంట్లోని వారు కంగారుపడ్డారు. మామూలు సర్పంలా కాకుండా ధవళ వర్ణం, ఎర్రటి కళ్లతో కనిపించిన పామును చూసి వారు మరింత భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములను చాకచక్యంగా పట్టుకునే రాజేశ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించారు.. అతను దానిని పట్టుకుని వేరే ప్రదేశంలో వదిలిపెట్టాడు. ఇలాంటి పాములు అత్యంత అరుదుగా కనిపిస్తాయని.. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం కేవలం 8 పాములే దేశం మొత్తం మీద కనిపించినట్లు రాజేశ్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్