బీజేపీ నేత దారుణ హత్య..చేతులు, కాళ్లు కట్టేసి

Published : Jul 03, 2018, 03:06 PM IST
బీజేపీ నేత దారుణ హత్య..చేతులు, కాళ్లు కట్టేసి

సారాంశం

ఆదివారం నుంచి కనిపించకుండా పోయి..  

బీజేపీ నేత దారుణ హత్యకు గురైన సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముషిదాబాద్ జిల్లాలోని శక్తిపూర్ ప్రాంతంలో ధర్మో హజ్రా అనే కార్యకర్త హత్యకు గురైనట్టు బీజేపీ వెల్లడించింది. ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన ధర్మో హజ్రా..  ఓ చెరువులో శవమై కనిపించాడు. 

ఓ తాడుతో మృతుడి కాళ్లూ, చేతులు కట్టేసి ఉండడం గమనార్హం. జిల్లాలోని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి హుమయూన్ కబీర్ బీజేపీలో చేరిన వారం రోజుల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం ట్విటర్లో స్పందిస్తూ... ‘‘టీఎంసీ గూండాలే ధర్మో హజ్రాను చంపేశారు. అతడి చేతులు కట్టేసి ఓ చెరువులో తోసేశారు. భరించలేని బాధతో అతడి ప్రాణాలు తీశారు.. ఎందుకు? బీజేపీ కార్యకర్త అయినందుకే అతడిని బలితీసుకున్నారు..’’ అని ఆరోపించింది. 

కాగా తమ కార్యకర్తలు ఇలాంటి వేధింపులకు పాల్పడబోరనీ... ఈ హత్యకు తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రబీవుల్ ఆలం చౌదురి పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సంఘటపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు శక్తిపూర్ పోలీసులు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలోనే పశ్చిమ బెంగాల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి