వాజ్ పేయీ అంత్యక్రియలు.. స్వామి అగ్నివేష్ పై దాడి

By ramya neerukondaFirst Published Aug 17, 2018, 3:32 PM IST
Highlights

ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన సమాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్ పేయీ గురువారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చిన ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.

ఈ విషయం గురించి అగ్నివేష్‌ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు.

అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్‌ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో జార్ఖండ్ లోనూ ఇలానే జరిగింది.క్రిస్టియన్ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి.. జార్ఖండ్‌లోని గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో ఆయనపై దాడి చేశారు.
 

click me!