ఆప్తమిత్రునికి కన్నీటి వీడ్కోలు పలికిన అడ్వాణి

Published : Aug 17, 2018, 02:47 PM ISTUpdated : Sep 09, 2018, 01:40 PM IST
ఆప్తమిత్రునికి కన్నీటి వీడ్కోలు పలికిన అడ్వాణి

సారాంశం

వాజ్‌పేయికి నివాళులు అర్పించిన అనంతరం అడ్వాణీ తీవ్ర విచారంతో తదేకంగా చూస్తూ కూర్చుండిపోయారు.   

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ కి తన ఆప్తమిత్రుడు, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వాజ్ పేయీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో... తన కుమార్తె ప్రతిభా అడ్వాణీతో కలిసి వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వీరివెంట శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించిన అనంతరం అడ్వాణీ తీవ్ర విచారంతో తదేకంగా చూస్తూ కూర్చుండిపోయారు. 

వాజ్‌పేయి, అడ్వాణీ మధ్య 65 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం పాటు స్నేహబంధం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది.  సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని స్మృతి స్థల్ వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?