ఇక సెలవ్: ముగిసిన వాజ్‌పేయ్ అంత్యక్రియలు

By narsimha lodeFirst Published 17, Aug 2018, 2:14 PM IST
Highlights

మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయ్ దత్తపుత్రిక నమిత  వాజ్‌పేయ్ చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సందర్భంగా కుటుంబసభ్యులు  శాస్త్రోక్తంగా చివరి కార్యక్రమాలను పూర్తి చేశారు. 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయ్ దత్తపుత్రిక నమిత  వాజ్‌పేయ్ చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సందర్భంగా కుటుంబసభ్యులు  శాస్త్రోక్తంగా చివరి కార్యక్రమాలను పూర్తి చేశారు. పోలీసులు గౌరవ సూచికంగా  గాల్లోకి కాల్పులు జరిపారు.

వాజ్‌పేయ్ అంత్యక్రియలు స్మృతిస్థల్‌లో శుక్రవారం సాయంత్రం పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాలు సీఎంలు,  ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు,.  ఆయా రాష్ట్రాల మంత్రులు వాజ్‌పేయ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీగా స్మృతిస్థల్ వద్దకు మోడీ, అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులు కాలినడకన వచ్చారు. 
 

 


విజయ్‌ఘాట్ పక్కనే వాజ్‌పేయ్ సమాధి కోసం 1.5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.  స్మృతిస్థల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడీ,
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు వాజ్‌పేయ్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి అద్వానీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ లు , బీజీేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  నివాళులర్పించారు.

వాజ్‌పేయ్ కుటుంబసభ్యులు శాస్త్రోక్తంగా అంత్యక్రియల సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించారు. వాజ్‌పేయ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. వాజ్‌పేయ్ చితికి ఆయన కూతురు నమిత నిప్పంటించారు.  వాజ్‌పేయ్ మృతికి గౌరవ చిహ్నంగా పోలీసులు  గాల్లోకి కాల్పులు జరిపారు.             

 

 

 

Last Updated 9, Sep 2018, 11:31 AM IST