పరువు హత్య : చంపి, జననాంగాలు కోసి.. రాజస్థాన్ లో జంట దారుణ హత్య..

By SumaBala BukkaFirst Published Nov 19, 2022, 9:01 AM IST
Highlights

రాజస్థాన్ లో జంట హత్యలు కలకలం రేపాయి. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ జంట విగతజీవులుగా నిర్జన ప్రదేశంలో కనిపించారు. ఇది పరువుహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజస్థాన్ : రాష్ట్రంలోని ఓ నిర్జన ప్రదేశంలో దారుణం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని గోగుండా పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్జన ప్రాంతంలో శుక్రవారం జంట మృతదేహాలు లభించాయి. ఇది పరువు హత్యా లేదా వ్యక్తిగత శత్రుత్వం ఈ దారుణానికి కారణమా? అనే కోణంలో పోలీసులు అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట గుర్తింపును పోలీసులు వెల్లడించారు. 

బాధితులు రాహుల్ మీనా (30), వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు సోను సింగ్ (28)గా గుర్తించారు. రాహుల్ గిరిజనుడు రాగా, సోనూ రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందింది. ఇద్దరూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో నివసించేవారు. వీరిద్దరినీ మొదట పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి, ఆ తర్వాత పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్.. సూట్ కేసులో యువతి మృతదేహం.. !!

"మీనా ప్రైవేట్ భాగాలు కోసేశారు. సోనూ జననాంగాలపై కూడా ఆయుధంతో చేసిన గాయాలు ఉన్నాయి. ఈ హత్య జరిగి రెండు రోజులైనట్టు మృతదేహాన్ని బట్టి తెలుస్తోంది. వీరిద్దరు కనిపించకుండా పోయి కూడా రెండు రోజులే అయ్యింది.. అని ఒక పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి కులాన్ని చూస్తే ఇది పరువు హత్యగా అనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

వ్యక్తిగత శత్రుత్వమే హత్యలకు కారణమై ఉండవచ్చని ఉదయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వికాస్ శర్మ తెలిపారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన మృతదేహాలు, సాక్ష్యాలను వైద్య,  ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. నవంబర్ 15 నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారని.. తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు

ఇదిలా ఉండగా, యూపీలోని మధురలో సూట్కేసులో కనిపించిన 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. 

కదులుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్, మహిళతో సహా నలుగురి అరెస్ట్..

click me!