కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో వీరికి సహకరించిన మహిళతో సహా వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళ : కేరళలోని కొచ్చీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ టీనేజ్ మోడల్ తో పరిచయం పెంచుకున్న మహిళ ఆమెను వంచించింది. కదులుతున్న కారులో 19 ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో ఒక మహిళతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి కొడంగల్లూర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ వాహనంలో కాసర్‌గోడ్‌కు చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
నగరంలోని కక్కనాడ్‌లో ఉంటున్న బాధితురాలిని ఆమె స్నేహితురాలు, రాజస్థానీ యువతి డీజే పార్టీకి ఆహ్వానించింది. అక్కడ ఆమెను పురుషులకు పరిచయం చేసిందని పోలీసులు తెలిపారు. బార్‌లో మద్యం తాగి వచ్చిన మోడల్‌ను నిందితులు ఆ పరిచయంతోనే తమ వాహనంలో ఎక్కించుకున్నారు. ఆ తరువాత 'గ్యాంగ్ రేప్' చేశారు.
"ఆమె మీద లైంగిక దాడి జరిగినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. నేరం చేసిన తర్వాత, ఆ వ్యక్తులు బాధితురాలిని కక్కనాడ్‌లో పడేశారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శుక్రవారం ఉదయం బాధితురాలిని ఆమె రూమ్‌మేట్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది. సదరు ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
షాకింగ్.. డాసనా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్..
ఇదిలా ఉండగా, కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఓ బాలికను కాటేశారు. వావివరుసలు మరచి, మృగాల్లా ప్రవర్తించి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసి, ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
పూణేలో ప్రస్తుతం బాలిక చదువుతున్న కాలేజీలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు ఆమె హాజరయ్యింది.
అక్కడ ఆమె తన గోడు వినిపించడంతో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూణే పోలీస్ స్టేషన్లో బుధవారం నిందితుల పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, ఆమె తండ్రిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 2016, 2018 సంవత్సరాల్లో తాను యూపీ లో ఉన్న సమయంలో తన అంకుల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తన తాతయ్య కూడా వేధింపులకు గురి చేసేవాడని బాలిక వాపోయింది.
2018లో పూణే వచ్చాక ఈ లైంగిక దాడి ఘటన గురించి తన తండ్రికి చెప్పుకోలేక.. ఓ చీటీలో రాసి ఇచ్చానని చెప్పింది. అయితే, అది చదివిన తండ్రి.. తనను హింసించే వారిపై చర్యలు తీసుకుని.. తనకు ఓదార్పును, రక్షణను ఇవ్వడానికి బదులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాలిక తండ్రి తో పాటు ఆమె అంకుల్, తాతయ్యలపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.