భారత్‌లోకి ఎంటరైన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్.. గుజరాత్, ఒడిశాలలో కేసులు

Siva Kodati |  
Published : Dec 21, 2022, 05:50 PM ISTUpdated : Dec 21, 2022, 05:56 PM IST
భారత్‌లోకి ఎంటరైన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్.. గుజరాత్, ఒడిశాలలో కేసులు

సారాంశం

చైనాలో కరోనా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలలో రెండు అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. 

చైనాలో కరోనా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని వడోదరాలో ఎన్ఆర్ఐ మహిళకు బీఎఫ్ 7 వేరియంట్ సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. సదరు ఎన్ఆర్ఐ మహిళతో పాటు మరో ముగ్గురిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే ఒడిశాలో మరొకరికి కూడా బీఎఫ్ 7 వేరియంట్ నిర్థారణ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్‌పోర్టుల్లోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాపై అప్రమత్తంగా వుండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది? | Asianet News Telugu
Gold Silver Price: 2026లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా? | Gold & Silver Prices | Asianet Telugu