వీడిన సంపూర్ణ సూర్యగ్రహణం: 5 గంటల పాటు కనువిందు చేసిన అద్బుతం

By Siva KodatiFirst Published Jun 21, 2020, 4:50 PM IST
Highlights

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగనతలంలో వలయాకార సుందర దృశ్యం ఆవిష్కృతమైంది

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగనతలంలో వలయాకార సుందర దృశ్యం ఆవిష్కృతమైంది.

Also Read:సూర్యగ్రహణం ఏయే రాష్ట్రాల్లో ఎలా కనబడిందంటే(ఒకే ఫ్రేములో)...

ప్రతి రెండేళ్లకోసారి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.16 గంటల నుంచి సూర్యగ్రహణం మొదలవ్వగా భారత్‌లో మాత్రం 10.14 గంటలకు పూర్తి స్థాయిలో గ్రహణం కనిపించింది.

భారతదేశంలో గుజరాత్‌లోని ద్వారకలో తొలుత కనిపించింది. ఆ తర్వాత ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో, ఆ తర్వాత రాజస్థాన్‌లో సంపూర్ణ సూర్య గ్రహణం ఆవిష్కృతమైంది. భారత్‌లో మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది. సూర్యగ్రహణం వీడటంతో దేశంలో కొన్ని ఆలయాలు సంప్రోక్షణ అనంతరం తెరచుకోనున్నాయి.

Also Read:సూర్య గ్రహణం 2020 : ప్రభావం ఎవరి మీద ఎలా ...

మరోవైపు  ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్ సూర్యగ్రహణం కారణంగా భూమి మీద పడే అతి నీలలోహిత కిరణాల వల్ల కొంతమేర నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మరోసారి సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

click me!