మహరాష్ట్రపై కరోనా పంజా: ఒక్కరోజే 88 మంది పోలీసులకు కోవిడ్, ఒక్కరు మృతి

Published : Jun 21, 2020, 04:38 PM IST
మహరాష్ట్రపై కరోనా పంజా: ఒక్కరోజే 88 మంది పోలీసులకు కోవిడ్, ఒక్కరు మృతి

సారాంశం

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 88 మంది పోలీసులకు కరోనా సోకింది. ఒక్కరు కరోనాతో మరణించారు. రాష్ట్రంలోని 4,048 మంది పోలీసులకు కరోనా సోకింది. కరోనా సోకి ఇప్పటికి రాష్ట్రంలో 47 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు.

ముంబై:మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 88 మంది పోలీసులకు కరోనా సోకింది. ఒక్కరు కరోనాతో మరణించారు.
రాష్ట్రంలోని 4,048 మంది పోలీసులకు కరోనా సోకింది. కరోనా సోకి ఇప్పటికి రాష్ట్రంలో 47 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1001 మంది పోలీసులు కరోనాతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 118 మంది పోలీసు అధికారులు ఉన్నారు. 883 మంది పోలీసు సిబ్బంది ఉన్నట్టుగా పోలీసు శాఖ ప్రకటించింది.

ఇప్పటివరకు మరణించిన 47 మందిలో ఒక్క పోలీసు అధికారి కూడ ఉన్నారు.దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,28,205 కేసులు నమోదయ్యాయి.  

కరోనాను నిరోధించేందుకు లాక్ డౌన్ నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేసినందుకు పోలీసులపై పలు దాడులు చోటు చేసుకొంటున్నాయి.
ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి 275 ఘటనలు చోటు చేసుకొన్నాయి. 

also read:ఒక్క రోజులోనే అత్యధికం: ఏపీలో 8,929కి చేరిన కరోనా కేసులు

లాక్ డౌన్ నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేసినందుకు గాను పోలీసులపై దాడులు చోటు చేసుకొన్నందుకుగాను 275 కేసులు నమోదయ్యాయి.ఈ ఘటనల్లో 86 మంది పోలీసులు గాయపడ్డారు. మరో వైపు  62 మంది హెల్త్ వర్కర్స్ కూడ దాడులకు గురయ్యారు.

188 సెక్షన్ కింద ఐపీసీ సెక్షన్ కింద 1,33,311 కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో 27,266 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు రూ. 832,23,711 జరిమానాను విధించారు. మార్చి 22వ తేదీ నుండి అక్రమంగా రవాణా చేసినందుకుగాను 1,335 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 83,487 వాహనాలను సీజ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే