జమ్మూలోని జదిబాల్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం

By narsimha lodeFirst Published Jun 21, 2020, 3:20 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లోని జదిబాల్ లో ఆదివారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇవాళ ఉదయం జదిబాల్, పోజ్వల్‌పోరా‌ ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది.


శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని జదిబాల్ లో ఆదివారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇవాళ ఉదయం జదిబాల్, పోజ్వల్‌పోరా‌ ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది.

ఉగ్రవాదుల తల్లిదండ్రులను తీసుకొచ్చి లొంగిపోవాలని హెచ్చరించినా కూడ వారు ససేమిరా అన్నారు. దీంతో ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా  కాశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. 

మరణించిన టెర్రరిస్టుల్లో ఒకరు 2019 నుండి ఉగ్రవాదులు నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని పోలీసులు తెలిపారు. మరొక ఉగ్రవాది గత నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా తేల్చారు.  ఈ ఎన్‌కౌంటర్ లో సీఆర్‌పీఎఫ్ కు చెందిన ముగ్గురితో పాటు ఓ సివిల్ పోలీస్ కూడ గాయపడ్డాడు. 

శ్రీనగర్ లో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఎన్ కౌంటర్. గత మే నెలలో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బూల్ ముజాహిద్దీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 

ఈ ఎన్ కౌంటర్ కారణంగా శ్రీనగర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

click me!