మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

By narsimha lode  |  First Published Jan 16, 2024, 11:42 AM IST

మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.



న్యూఢిల్లీ:మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై మంగళవారంనాడు సుప్రీంకోర్టు  కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై  సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై  సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఆలయం సమీపంలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  అయితే  ఈ ఆదేశాలపై  సుప్రీంకోర్టులో మసీదు కమిటీ  సవాల్ చేసింది . 

షాహీ ఈద్గా మసీదు పరిశీలనకు  కమిషనర్ ను నియమించాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై  సుప్రీంకోర్టు స్టే విధించింది.జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన    సుప్రీంకోర్టు  ధర్మాసనం ఈ విషయమై ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను  కమిటీ ఆఫ్ మేనేజ్ మెంట్ ట్రస్ట్ షాహీ మసీద్ ఈద్గా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.ఈ విషయమై హిందూ సంస్థలకు కూడ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్ పై ఈ నెల  23న విచారణ నిర్వహించనున్నట్టుగా తెలిపింది. 

Latest Videos

కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా మసీదు కేసు ఏమిటీ

మధురలో స్థలానికి సంబంధించిన దశాబ్దాల నాటి వివాదం.  ఇక్కడ కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకొని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఒక్కప్పుడు హిందూ దేవాలయంగా ఉండేదని సూచించే సంకేతాలు కలిగి ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. మధురలోని కృష్ణుడి జన్మస్థలంపై మసీదు నిర్మించినట్టుగా హిందూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. హిందూ దేవాలయాల యొక్క తామర ఆకారంలో ఉన్న స్థంబం మసీదు ఆవరణలో ఉందని  పేర్కొన్నారు. 

కృష్ణ జన్మభూమి  కేసులో షాహి ఈద్గా మసీదు ప్రాంగంణంలో కోర్టు పర్యవేక్షణలో సర్వేకు  అలహాబాద్ హైకోర్టు 2023 డిసెంబర్  14న అనుమతిని ఇచ్చింది.  హిందూ పిటిషనర్ల వినతి మేరకు  హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.  మసీదుకు  చెందిన  13. 37 ఎకరాల భూమిని పునరుద్దరించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన అలహాబాద్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  

click me!