అయోధ్యలోని రామమందిర ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’కు సంబంధించిన ఉత్సవాలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) శుక్రవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన 40కి పైగా బిల్‌బోర్డ్‌లను ఆవిష్కరించింది. దీంతోపాటు ప్రవాస భారతీయులు కారు ర్యాలీ నిర్వహించారు.
అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో జరిగి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు తెలిపేలా ఓ మహత్తర కార్యక్రమాన్ని తీసుకుంది. దీనికోసం అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో 40కి పైగా బిల్‌బోర్డ్‌లను ఆవిష్కరించింది. ప్రధానంగా రాష్ట్రాల్లోని ప్రసిద్ధ స్పీడ్‌వేలపై ఈ బోర్డులను అమర్చింది.
అయోధ్యతో పాటు న్యూఢిల్లీలో రామమందిర ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత ప్రధాని జనవరి 22న అయోధ్యకు బయలుదేరే ముందు 11 రోజుల అనుష్ఠాన్ (ఉపవాసం) కూడా ప్రారంభించారు. ఈ చారిత్రక సంఘటనను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వివిధ హిందూ సంస్థలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి.
undefined
రామమందిరం ప్రారంభోత్సవం : నేటినుంచి ప్రాణప్రతిష్టవరకు జరిగే కార్యక్రమాల పూర్తి షెడ్యూల్ ఇదే...
ఇప్పటి వరకు అమెరికాలోని 10కి పైగా రాష్ట్రాలలో విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా విజయవంతంగా భారీ బిల్ బోర్డులను ఏర్పాటు చేసింది. వీటిలో భారతీయులు ఎక్కువ టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీచ జార్జియాల్లో ఉంటారు. ఇక అరిజోనా, మిస్సౌరీలు జనవరి 15 నుండి జనవరి 22 వరకు జరగనున్న రామమందిరం ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ వేడుకకు సంబంధించిన విజువల్ సెలబ్రేషన్ చేసుకోనున్నట్లు ప్రకటించాయి.
అమెరికాలోని విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ అమితాబ్ వీడబ్ల్యూ మిట్టల్ మాట్లాడుతూ, “ఈ బిల్‌బోర్డ్‌లు అందించే సందేశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారే జరిగే ఈ కార్యక్రమంలో హిందూ అమెరికన్లు ఉల్లాసంగా, ఆనందంగా పాల్గొంటున్నారని, ఈ పవిత్రమైన రోజు కోసం వారు ఆసక్తిగా, భావోద్వేగంతో ఎదురుచూస్తున్నట్లుగా తెలుపుతోంది.
ఇటీవల, మేరీల్యాండ్‌లోని ఫ్రెడరిక్ సిటీకి సమీపంలో ఉన్న అయోధ్య వేలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయం నుండి రామభక్తులు కారు ర్యాలీ చేపట్టారు. యుఎస్‌లోని ప్రవాస భారతీయుల సమిష్టి భాగస్వామ్యంతో ఇటువంటి అనేక కార్యక్రమాలు రామమందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' తదుపరి దశలో జరగబోతున్నాయి. న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ లో భారీ డిజిటల్ బిల్‌బోర్డ్ మీద ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.