నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం కోర్టు.. స్వాగతించిన కేంద్ర మంత్రి

By Galam Venkata Rao  |  First Published Jul 23, 2024, 9:18 PM IST

సుప్రీం కోర్టు తీర్పును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్వాగతించారు. నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంపై హర్షం వ్యక్తం చేశారు.


నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం చివరికి సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. నీట్‌- యూజీ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని భారత సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలైంది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

కాగా, సుప్రీం కోర్టు తీర్పును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్వాగతించారు. నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంపై హర్షం వ్యక్తం చేశారు. సత్యమే గెలిచిందని పేర్కొన్నారు.నీట్- యూజీ పరీక్షల తుది ఫలితాలు 2 రోజుల్లో వెలువడుతాయని చెప్పారు.

Latest Videos

‘నీట్ పేపర్ లీకేజీ పెద్ద ఎత్తున జరగలేదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది.. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా దానిని సమర్థించింది. ప్రభుత్వం ఎలాంటి ఉల్లంఘనలను సహించదని, పరీక్షల పవిత్రత మాకు సుప్రీం’ అని కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మెడికల్ ప్రవేశ పరీక్షలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో NEET-UG తుది ఫలితాలను NTA ప్రకటిస్తుందని... సుప్రీం కోర్టు చేసిన పరిశీలనల ప్రకారం పరీక్ష మెరిట్ జాబితాను సవరిస్తామని తెలిపారు. నీట్ అంశంపై ప్రతిపక్షాలు అరాచకం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

click me!