ఊరట: అనర్హత సమర్ధన, ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్యేలకు ఛాన్సిచ్చిన సుప్రీం

By narsimha lodeFirst Published Nov 13, 2019, 10:54 AM IST
Highlights

అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం నాడు అనుమతి ఇచ్చింది. మరో వైపు అనర్హతను సుప్రీం కోర్టు సమర్ధించింది.


బెంగుళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన  ఎమ్మెల్యేల అనర్హతను సుప్రీంకోర్టు సమర్ధించింది.  అయితే అనర్హతకు గురైన 15 మంది ఎమ్మెల్యేలు  వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ సుప్రీం కోర్టు అవకాన్ని కల్పించింది.

కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ ప్రకటించారు.

 అదే నెల 9వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నందున ఈ నెల 11వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Also read:కేసు పెండింగ్ ఎఫెక్ట్: కర్ణాటక ఉప ఎన్నికలకు బ్రేక్

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో విప్ కు వ్యతిరేకంగా ఓటు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. అంతేకాదు అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూడ ఆదేశాలను జారీ చేశారు.

అయితే ఈ ఆదేశాలపై అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై అన్ని వర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పును చెప్పింది.

ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతను విధించే అధికారం స్పీకర్ కు లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2025 వరకు 17 మంది ఎమ్మెల్యేలపై ఉన్న విధించిన అనర్హతను సుప్రీంకోర్టు  తగ్గించింది.

అసెంబ్లీ గడువు ముగిసే వరకు అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. కర్ణాటక రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు పోటీ చేయనున్నారు. 

కర్ణాటక రాష్ట్రంలో  ఉప ఎన్నికలు ఈ  ఏడాది సెప్టెంబర్ మాసంలో జరగాలి. ఎన్నికల  సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడ విడుదల చేసింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో  పాటు  కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కర్ణాటక రాష్ట్రంలో  కుమారస్వామి బలపరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ ఫిర్యాదు మేరకు  17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఆరేళ్ల పాటు అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదు.అయితే అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని  సుప్రీంకోర్టును కోరారు.

ఈ తరుణంలో తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తామని  సుప్రీం కోర్టుకు  ఈసీ తెలిపింది. ఈ కారణంగానేసెప్టెంబర్ మాసంలో జరగాల్సిన ఎన్నికలను  వాయిదా వేశారు. ఈ ఎన్నికల షెడ్యూల్ ను కర్ణాటక రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు.

హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వంపై జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 17 మంది  ఎమ్మెల్యేలు పార్టీ విప్‌లకు వ్యతిరేకంగా ఓటు చేశారు. పార్టీ విప్‌లను ధిక్కరించి ఓటు చేసినందుకు గాను  అప్పటి స్పీకర్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో ఈ  స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.అనర్హత పిటిషన్లపై కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

బీజేపీలోకి

అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలలో 15 మంది ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో ఆయా పార్టీల విప్‌లకు వ్యతిరేకంగా ఓటు చేసినందున ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు.

అయితే వచ్చే నెలలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించడంతో అనర్హతకు గురైన 15 మంది ఎమెల్యేలు బీజేపీలో చేరనున్నారు.బీజేపీ అభ్యర్ధులుగా వారంతా వచ్చే నెలలో జరిగే ఉప ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉందని సమాచారం.
 

click me!