ఆ రోడ్లు.. హేమమాలిని చెంపల్లా ఉంటాయి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద కామెంట్స్

Published : Nov 13, 2019, 09:41 AM IST
ఆ రోడ్లు.. హేమమాలిని చెంపల్లా ఉంటాయి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద కామెంట్స్

సారాంశం

తాను  నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని తెలిపారు. కానీ తన ప్రాంతంలోని రోడ్లన్నీ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని చెంపల మాదిరిగా నిర్మించాను అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   

సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై  కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  రోడ్లను హేమమాలిని చెంపలతో పోలుస్తూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మరాయి.  పూర్తి వివరాల్లోకి వెళితే... చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

AlsoRead కాంగ్రెసు "మహా" షాక్: సోనియా గాంధీపై శరద్ పవార్ అసంతృప్తి...

తాను  నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని తెలిపారు. కానీ తన ప్రాంతంలోని రోడ్లన్నీ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని చెంపల మాదిరిగా నిర్మించాను అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

AlsoRead లోయలో పడిన వాహనం...16మంది దుర్మరణం...

కాగా.. కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో పాఠశాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న లఖ్మా.. విద్యార్థులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తనలా రాజకీయ నాయకుడు కావాలనుకుంటే కలెక్టర్, ఎస్పీల కాలర్‌లు పట్టుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !