అశ్లీల వీడియోలు తీసి... తల్లీకూతురుపై సాటి మహిళ అత్యాచారం చేయించి...

Published : Jun 11, 2023, 02:39 PM IST
 అశ్లీల వీడియోలు తీసి... తల్లీకూతురుపై సాటి మహిళ  అత్యాచారం చేయించి...

సారాంశం

తల్లీ కూతురుపై సాటి మహిళే అత్యాచారం చేయించిన అమానుషం ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

లక్నో : భర్తను కోల్పోయి  కూతురితో కలిసి జీవిస్తున్న ఓ మహిళలో తోటి మహిళే దారుణంగా వ్యవహరించింది. వివాహితతో స్నేహం చేసిన మహిళ ఇంటికి వెళుతూ రహస్యంగా అశ్లీల వీడియోలు చిత్రీకరించింది. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి కొందరితో మహిళపై అత్యాచారం చేయించింది. అంతేకాదు ఆమె బిడ్డపైనా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపీ బరేలీ జిల్లా బారాదరి ప్రాంతంతో ఓ వితంతువు జీవిస్తోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోగా 12 ఏళ్ళ కూతురితో కలిసి జీవిస్తోంది మహిళ. మగదిక్కు లేని తల్లీకూతుళ్ల దీనస్థితిని ఓ మహిళ అలుసుగా తీసుకుంది. ఇరామ్ సైఫీ అనే మహిళ వితంతు మహిళతో పరిచయం పెంచుకుని తరచూ ఇంటికి వెళుతుండేది. తల్లీకూతుళ్ల పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న సైఫీ కొందరు మగాళ్ళను తీసుకుని వెళ్లడం ప్రారంభించింది. వారితో భర్తలేని స్నేహితురాలిపై అత్యాచారం చేయించి వీడియోలు చిత్రీకరించింది. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. 

ఇరామ్ సైఫీ సోదరుడు బబ్లూ మహిళ 12ఏళ్ళ కూతురిని లైంగికంగా వేధించేవాడు. పలుమార్లు బాలికపై అత్యాచారానికి కూడా యత్నించాడు. ఇలా తల్లీకూతురుపై ఇరామ్ సైఫీ మనుషులు లైంగిక వేధింపులకు దిగుతూ నరకం చూపించేవారు. ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతానని బెదిరించడంతో మహిళ కూడా ఏం చేయలేకపోయింది. 

Read More  ఆర్మీ జవాన్ భార్యకు అవమానం.. అర్ధనగ్నంగా చేసి 120 మంది చితకబాదారని, న్యాయం చేయాలని వీడియోలో హవిల్దార్ ఆవేదన..

అయితే ఇటీవల లైంగికంగానే కాకుండా మతం మారాలంటూ తల్లీకూతురును ఇరామ్ సైఫీ వేధించడం ప్రారంభించింది. ఓ మతపెద్ద సమక్షంలో మతం మార్చడానికి అన్నిఏర్పాట్లు చేసింది. కానీ మతమార్పిడి ఇష్టంలేని బాధిత మహిళ తిరగబడటంతో వారిని చితకబాది వెళ్లిపోయారు. 

ఇక ఇరామ్ సైఫీ వేధింపులు భరించలేకపోయిన తల్లీకూతుళ్ళు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితురాలుు ఇరామ్ సైఫీ, ఆమె సోదరుడు బబ్లూ, మతపెద్దతో పాటు మరొకరిని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌